నెటిజన్‌ను తిట్టిన మంచు లక్ష్మీ.. పోవే అంటూ రివర్స్ అటాక్.. మల్లెపూలు ట్వీట్ వైరల్
మంచు లక్ష్మీ తెలుగు భాషా ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె భాష, యాస, మాట్లాడే విధానం తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఇట్టే గుర్తుపడతారు. ఆమె ఇంగ్లీష్ భాష, యాసపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి అందరికీ తెలిసిందే.అంతేకాకుండా ఒక్కో సందర్భంతో తెలుగు, ఇంగ్లీష్ పదాలను కలిపి కూడా వాడేస్తుంది. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ అర్థం కాక నెటిజన్స్ డైలామాలో పడ్డారు. అదేంటో ఓ సారి చూద్దాం.

మంచు లక్ష్మీ నిలదీస్‌ఫై
ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ.. నిలదీస్‌పై అంటూ పుసుక్కున నోరు జారేసింది. అయితే దాని మీనింగ్‌ను ఏ నిఘంటువులో వెతికినా దొరకదు. అప్పట్లో ఈ పదం ఎంతగా హల్చల్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే పదాన్ని మంచు మనోజ్ తన ట్వీట్‌లో వాడేసాడంటే అదెంత హల్చల్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

కరోనాపై మంచులక్ష్మీ కామెంట్స్..
ప్రస్తుతం కరోనా వైరస్ కాలం నడుస్తోంది. అయితే ఈ కరోనాను కూడా మన జనాలు తప్పుగా పలుకుతున్నారట. అసలు ఎలా పలకాలో మంచు లక్ష్మీ వివరించింది. కరోనాలోని ఆర్ అనేది కింద పడి అలా దొర్లాలి అని ఇంగ్లీష్ క్లాస్ ఇచ్చింది. ఇక ఈ వీడియో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

డైలామాలో పడేసిన ట్వీట్..
తాజాగా మల్లెపువ్వును కూడా కూనీ చేసేసింది. ఎన్ని రకాలుగా పలకాలో అన్ని రకాలుగా ప్రయోగాలు చేసింది. మల్లి, మాలి, మాలె, మాలెపువ్వు అంటూ ఈ ఫోటోను తెగ ఎంజాయ్ చేస్తున్నానంటూ ట్విట్టర్ జనాలకు తెలిపింది. అంతకు ముందు ట్వీట్‌లో.. ‘అమ్మ మాలి పువ్వులు పెట్టింది.. మా తోటలోని పువ్వులు' అంటూ పేర్కొంది. అయితే ఈ ట్వీట్‌కు అర్థం తెలియక అందరూ తికమక పడుతున్నారు.

పోబే పోవే కామెంట్స్ వైరల్..
అయితే ఆమె చేసిన ఈ ట్వీట్‌లో తప్పులను ఎంచుతూ మాలి కాదది..మల్లె అని కరెక్ట్ చేశాడో నెటిజన్. ఈ ట్వీట్‌కు మండి పడిన మంచు లక్ష్మీ పోబే అంటూ కామెంట్ పెట్టింది. అవతలి వాడు కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా పోవే అంటూ కామెంట్ పెట్టాడు.

ట్వీట్‌లో భిన్నర్థాలు..
అయితే కొందమంది మాత్రం ఆమె పెట్టిన ట్వీట్‌ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. అమ్మ మళ్లీ పువ్వులు పెట్టింది అని చెప్పదలుచుకుందేమోనని కామెంట్స్ చేశారు. అయితే మళ్లీ పువ్వులు కాస్తా.. మల్లె పువ్వులు అయ్యాయని సెటైర్స్ వేయసాగారు మరికొందరు.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తండ్రి మోహన్ బాబు ఇంట్లోనే ఉంటుంది మంచు లక్ష్మీ ఈ నేపథ్యంలో తమతోటలో పూసిన మల్లె పూలు పెట్టుకొని ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. `అమ్మ మల్లె పువ్వులు పెట్టిం...


Click it and Unblock the Notifications











