twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు లక్ష్మిని ప్రశంసిస్తూ రేణు దేశాయ్ కామెంట్స్, ఏం జరిగిందంటే....

    By Bojja Kumar
    |

    తెలుగు నటి మంచు లక్ష్మి 'మేము సైతం' అనే టీవీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ..... ఆర్థికంగా చేయూత అవసరమైన కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా చేయూత అందేలా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సినీ సెలబ్రిటీలను ఈ షోలో భాగం చేస్తూ ఫండ్ రైజ్ అయ్యేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో నటి రేణు దేశాయ్ కూడా భాగం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మంచు లక్ష్మిని ఉద్దేశించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    మంచు లక్ష్మి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఎవరికైతే సహాయం అవసరమో వారికి అందేలా దోహదపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమంలో నేనూ భాగం అయినందుకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా బొమ్మలు అమ్మడం ద్వారా రూ. 30 వేలు ఫండ్ కలెక్ట్ అయ్యేలా చేశాను. దీనికి నా వంతుగా రూ. 20 వేలు కలిపాను. దీనికి మరో రూ. లక్ష కలిపి మొత్తం రూ. 1.5 లక్షలను 35 మంది పిల్లలకు చదువుకు విరాళం ఇవ్వడం జరిగింది అని రేణు దేశాయ్ వెల్లడించారు.

    మీరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి. ఎవరికైతే అవసరం ఉందో మీ వంతుగా ఎంతో కొంత సహయం చేయండి. పిల్లల చదవు కోసం, ఆహారం కోసం, మెడిసిన్ ఇలా ఏదో ఒక సహాయం చేయండి. మీ దగ్గర్లో ఉన్న ఎన్జీవోలకు కొంత సమయం కేటాయించి సహాయ పడండి. మీ సహాయం మరొకరి జీవితంలో మార్పు వచ్చేలా దోహదం చేస్తుంది అని రేణు దేశాయ్ ఫేస్ బుక్ ద్వారా మంచు లక్ష్మిపై ప్రశంసల వర్షం కురిపించారు.

    English summary
    "Laxmi garu is truly doing a brilliant job by raising awareness and helping out people in true need. It is such an amazing feeling when my work is able to help someone else without me earning a single rupee for myself out of the shoot. I am so happy that I could raise 30 thousand rupees selling toys, added another 20 thousand from my side and with Laxmi garu giving 1 lakh, we were able to collect 1.5 lakhs towards the education of 35 kids. I would request all of you to do a little bit from your side to help someone who needs your help. Try to help out a child of your house help lady with education or food or medicine. Or try to give few hours of your time to a NGO in your area. Any small thing that works for you. Your little contribution of money or time can make a huge difference to another humans life." Renu Desai tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X