సెక్స్ అనేది పెద్ద బూతు అంటారు..కానీ.: మంచు లక్ష్మి
హైదరాబాద్ : సినిమాల్లో కత్తులతో నరుక్కోవడం చూపిస్తే తప్పుకాదు కానీ, ఆడామగా చేయి చేయి పట్టుకొని కాస్త క్లోజ్‌గా మూవ్ అయితే తప్పా? సెక్స్ అనేది పెద్ద బూతు అంటారు. చేయి పట్టుకోవడమే తప్పంటారు. మళ్లీ తెగ పిల్లల్ని కనేసి జనాభాను పెంచేస్తుంటారు అంటున్నారు మంచు లక్ష్మి. సాక్షి తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె ఇలా స్పందించారు.
అలాగే ... ఆ మధ్య నేను 'సెక్స్' గురించి మాట్లాడాను అని మీరు అన్నారు. నేను అప్పుడూ నిజమే మాట్లాడాను. 'సెక్స్' అనేది తప్పుకాదు. అజంతా, ఎల్లోరా శిల్పాలు ఓ సారి చూడండి. వాటి ద్వారా సెక్స్‌కి సంబంధించిన చాలా అంశాలు మన పూర్వీకులు చెప్పారు. వాత్సాయన కామసూత్రాలను ప్రపంచానికి అందించింది మనవాళ్లే అన్నారు. సంచలనాల కోసం నేను మాట్లాడను. నాకు నిజం అనిపించింది మాట్లాడతాను. అది మీకు నిజం అనిపించాలని నేను అనుకోను అని సూటిగా అన్నారు.
ఇక మనకు ఇంత పాపులేషన్ ఎలా వచ్చిందండీ.. చదువు, సంస్కారం వున్న ఎవరూ సెక్స్‌ని ఒక తప్పుగా భావించరు. ప్రపంచ జనాభాలో మన దేశం రెండో స్థానంలో ఉందంటే కారణం మనవాళ్లలో ఎక్కువమంది నిరక్షరాస్యులు కావడమే. పిల్లల్ని కంటే 'వాళ్ళెళ్లి కూలి పనిచేసుకొచ్చి మమ్మల్ని పోషిస్తారు' అని చీప్‌గా ఆలోచించి పిల్లల్ని కనేవాళ్లు కూడా మనదేశంలో ఉన్నారు. ఒకరిద్దరు పిల్లలితో సరిపెట్టుకొని వారికే చదువును, సంస్కారాన్ని నేర్పి, వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దితే మన దేశం అన్ని దేశాల్లో అగ్రగామి అవుతుంది అని వివరించారు.


Click it and Unblock the Notifications











