twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గర్వంగా ఉందంటూ...మంచు లక్ష్మి ఫుల్ హ్యాపీ..

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన వెలువడింది. ప్రాంతీయ చిత్రాల కేటగిరిలో ఈ ఏడాది ఉత్తమ తెలుగు చలన చిత్రంగా 'చందమామ కథలు' ఎంపికైంది. ప్రవీణ్‌ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

    ఈ సందర్బంగా చందమామ కథలకు జాతీయ అవార్డు రావడం పట్ల చిత్ర యూనిట్‌ ఆనందం వ్యక్తం చేసింది. తెలుగు అమ్మాయిగా తనకెంతో గర్వంగా ఉందని ఈ చిత్రంలో నటించిన మంచు లక్ష్మీ అన్నారు.

     Manchu Laxmi happy with Chandamama Kathalu won the national award

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ చందమామ కథలకు అవార్డు రావడం పట్ల తెలుగు ఫిలిమ్‌ ఇండస్ట్రీ గర్వపడాల్సిన విషయమని అన్నారు. ఆ సినిమా బయటకు రావడానికి, ఆ చిత్రం చేయడానికి నిర్మాత, డైరెక్టర్‌ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసునని ఆమె అన్నారు.

    నేను చేసిన మొదటి చిత్రం ‘అనగా అనగా ఓ ధీరుడు'కు నంది అవార్డు వచ్చిందని, ‘గుండెల్లో గోదావరి'కి ఫేమా అవార్డు వచ్చిందని మంచు లక్ష్మీ తెలిపారు. అలాగే ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమాకు అవార్డు వచ్చిందని, ఇప్పుడు చందమామ కథలకు జాతీయ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందని మంచు లక్ష్మీ తెలిపారు.

    ఒక కొత్త కోణంతో నటించానని, అదోక కీలకమైన పాత్రని హీరో నరేష్‌ అన్నారు. అలాంటి ఆ చిత్రానికి జాతీయ అవార్డు రావడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఆ చిత్రంలో నేను ఒక పాత్ర చేసినందుకు చాలా ఆనందంగా ఉందని కృష్ణుడు అన్నారు.

    English summary
    Lakshmi Manchu tweeted: " Omg omg omg ‪#‎chandamamaKathalu‬ just won the national award for the best regional film. Yayayayayayayyayayayayay."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X