డాడీ పోషించిన పాత్ర...మంచు లక్ష్మీ ప్రసన్న
డాడీ పోషించిన పాత్ర ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ. మనోజ్ నటన అందరి మెప్పు పొందుతుంది అంటూ తను నిర్మిస్తున్న 'ఝుమ్మంది నాదం' చిత్రం గురించి చెప్పుకొచ్చింది మంచు లక్ష్మీ ప్రసన్న. సీనియర్ దర్శకులు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ కుమార్ హీరోగా రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఝుమ్మంది నాదం'. తాప్సీ అనే నూతన హీరోయిన్ పరిచయమవుతున్న ఈ చిత్రంలో మోహన్ బాబు విభిన్నమైన పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్ర విశేషాలను మీడియాకు నిర్మాత మంచు లక్ష్మీప్రసన్న తెలియచేస్తూ...రాఘవేంద్రరావు దర్శకత్వంలో మా సంస్థ నుంచి వస్తున్న సంగీతభరితమైన ప్రేమకథా చిత్రమిది. కీరవాణి సంగీతం మా సినిమాకు ఆభరణం లాంటిది. పాటలు తప్పకుండా శ్రోతల్ని మెప్పిస్తాయి. డాడీ పోషించిన పాత్ర ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ. మనోజ్ నటన అందరి మెప్పు పొందుతుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఆ పాటను త్వరలో విదేశాల్లో చిత్రిస్తాం. ఈ నెల 23న ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా పాటలను ఆవిష్కరిస్తాం. జూన్ రెండో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామ న్నారు.


Click it and Unblock the Notifications











