శ్రీవారిని దర్శించుకున్న మంచు లక్ష్మీ, రకుల్.. హ్యాపీ బర్త్‌డే డైలాగ్ కింగ్..
విళంబి నామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున మంచు మోహన్‌బాబు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. మోహన్‌బాబు కుటుంబంతోపాటు హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ స్వామివారిని దర్శించుకొన్నారు. వీఐపీ విరామ సమయంలో వీరు స్వామివారి మూలవిరాట్టును దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, సోమవారం (మార్చి 19న) మోహన్‌బాబు తన జన్మదినాన్ని జరుపుకోవడం కూడా విశేషం.

టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. మోహన్ బాబు మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరం రోజున స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆ తర్వాత ఆలయం బయట మంచు లక్ష్మీ, రకుల్ మీడియాతో మాట్లాడారు.
mohan babu manchu laxmi rakul preet singh tirumala మోహన్‌బాబు మంచు లక్ష్మీ రకుల్ ప్రీత్ సింగ్ తిరుమల


Click it and Unblock the Notifications