కొన్ని బయటకు చెప్పుకోలేను.. ఆ బాధను చెప్పలేను..
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులలో మోహన్ బాబు ఒకరు. ఆయన తన స్వయంకృషి ఎదిగారు. ఆస్తులు,పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఈ కుటుంబంలో సడన్ గా గొడవలు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు.. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు.. మరోవైపు మంచు మనోజ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మికి సంబంధించిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
మంచు కుటుంబంలో గొడవలు రావడంతో అందరూ షాక్ అవుతున్నాయి. రెండు రోజుల క్రితం మంచు మోహన్ బాబు , మంచు మనోజ్ ఆస్తి విషయంలో గొడవలు పడ్డారని వార్తలు వచ్చాయి. ఆస్తుల కోసం తండ్రీ కొడుకుల మద్య జరుగుతున్న గొడవలు జరిగాయనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ పరస్పరం పోలీస్ స్టేషన్‌లో పిర్యాదులు చేసుకోవడం, మంచు మనోజ్ తండ్రికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు పోలీసులకు సమర్పిస్తానని చెపుతున్నారు. వారి ప్రతిష్ట వారి నీరు కారుచుకున్నారు. అందరి ముందు నవ్వులపాలవుతున్నారు.

ఈనేపథ్యంలో మంచు లక్ష్మికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆమె నటిగా నిర్మాతగా రాణిస్తూనే సమయం దొరికినప్పుడల్లా బుల్లితెరపై యాంకర్ గా.. హోస్ట్ గా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అయితే.. పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు అమెరికాలో ఉన్న ఈమె.. ఇండియాకు వచ్చింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో సెట్ కావడానికి ఇబ్బంది పడినట్లు పేర్కొంది. తాను ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చినా.. తాను కూడా ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది వచ్చిందని పేర్కొంది.
'మీరు మోహన్ బాబు కూతురు కదా.. మీకేంటి సులభంగా అవకాశాలు వస్తాయి అనేవారు ఉన్నారు. కానీ, ప్రతి విషయంలో అందరూ సహకరించాలని ఏం లేదని, మీరు బాధలను బయట పెట్టుకుంటారు. మేము పెట్టుకోలేము అంతే.. నిజాలు చెప్తే మీరే తట్టుకోలేరు. అమ్మో ఇలా కూడా ఉంటారా? మీకు కూడా ఇలా చేస్తారా? అని మీరు కూడా నమ్మలేరు. కానీ, మమ్మల్ని మేము కాపాడుకుంటూ.. మా ఫ్యామిలీ ప్రతిష్టను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం.. ప్రతి గొడవకు మేము బయటికి రాలేము. ప్రతి మోసాన్ని మేము చెప్పుకోలేం.. మా జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
మంచు లక్ష్మి ఇంకా మాట్లాడుతూ.. 'ఇప్పటికి మా నాన్న ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తన అనుభవాలతో మమ్ములను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆయన కేవలం జాగ్రత్తలు చెప్పి వదిలేయకుండా మమ్మల్ని ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. అలాగే ఏదైనా విషయం తన దృష్టికి వస్తే దాన్ని అక్కడికక్కడే సాల్వ్ చేసే వరకు తాను ఊరుకోరని తెలిపారు. రియల్లీ మా నాన్న గ్రేట్. అంటూ ప్రశంసలు కురిపించింది.


Click it and Unblock the Notifications











