»   » ‘మామ మంచు-అల్లుడు కంచు’ రివ్యూ.....

‘మామ మంచు-అల్లుడు కంచు’ రివ్యూ.....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

ఒకప్పుడు వరుస హిట్లతో మినిమం గ్యారంటీ హీరోగా దూసుకెల్లిన అల్లరి నరేష్ ఆ మధ్య చాలా వెనకబడి పోయాడు. అల్లరి నరేష్ సినిమా అంటే రోటీన్ సినిమా అనే ముద్ర పడిపోయింది. ఈ నేపథ్యంలో రూటు మార్చిన అల్లరి నరేష్ ప్రముఖ నటుడు మోహన్ బాబుతో కలిసి మల్టీ స్టారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా ఇది అల్లరి నరేష్ నటించిన 50వ సినిమా. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మంచు విష్ణు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అందుకు సంబంధించిన విశేషాలేమిటో చూద్దాం...

కథ విషయానికొస్తే..భక్తవత్సలం నాయుడు( మోహన్ బాబు) అనుకోని పరిస్థితుల్లో రెండు పెళ్ళిలు చేసుకొని పాతికేళ్లుగా ఒకరి తెలియకుండా ఒకరిని మేనేజ్ చేయానికి ముప్పతిప్పలు పడుతుంటారు. మొదటి భార్య సూర్యకాంతం (మీనా) కి ఒక కూతురు శృతి(పూర్ణ), రెండో భార్య ప్రియంవద(రమ్యకృష్ణ)కు ఓ కొడుకు గౌతమ్ నాయుడు(వరుణ్ సందేశ్).


శృతి, గౌతమ్ ల పుట్టిన రోజులు కూడా ఒకే రోజు కావటంతో ఇద్దరు పిల్లలకు పుట్టినరోజు కానుకలు ఇచ్చే క్రమంలో అడ్రస్ లు మారిపోతాయి. శృతి గిఫ్ట్, గౌతమ్ కు, గౌతమ్ గిఫ్ట్ శృతికి వెళుతుంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసే పరిస్థితి వస్తుంది. వారు కలిస్తే తన చిన్న ఇల్లు పెద్ద ఇల్లు వ్యవహారం బయట పడుతుందని....బాలరాజు(అల్లరి నరేష్)ను రంగంలోకి దింపుతాడు. భక్తవత్సవంల నాయుడు ఊహించని విధంగా బాలరాజు శృతి ప్రేమిస్తాడు. బాలరాజు నుండి తన కూతురిని కాపాడుకోవడానికి, ఇన్నాళ్లు తాను కాపాడుకుంటూ వస్తున్న రహస్యాన్ని కాపాడుకోవడానికి భక్తవత్సలం నాయుడు ఏం చేసాడు? చివరకు ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.


Manchu Mama Alludu Kanchu review

పెర్పార్మెన్స్ విషయానికొస్తే...తన వయసుకు తగిన పాత్రను ఎంచుకున్న మోహన్ బాబు.... ఆపాత్రలో యాక్టివ్ గా నటించారు. పూర్తి న్యాయం చేసారు. కామెడీ టైమింగుతో ఎంటర్టెన్ చేసారు. అల్లరి నరేష్ కూడా ఏ మాత్రం తీసిపోకుండా పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. కామెడీ సీన్లతో పాటు ఎమోషన్ సీన్లలో కూడా బాగా నటించాడు. అలీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మీనా, రమ్యకృష్ణ మరోసారి పాత రోజులను గుర్తు తెచ్చారు. పూర్ణ, వరుణ్ సందేశ్ తమ పాత్రల పరిది మేరకు నటించారు.


వివిధ విభాగాల పనితీరు విషయానికొస్తే...దర్శకుడు శ్రీనివాసరెడ్డి మరోసారి తన పనితనం చూపించాడు. మరాఠి సినిమాను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మలిచి సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. ప్రేక్షుకుడిని ఆద్యంతం ఎంటర్టెన్ చేసే విధంగా బాగా తెరెక్కించాడు. శ్రీధర్ సీపాన రాసిన డైలాగులు బావున్నాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి. అయితే సంగీతం మాత్రం ఆకట్టుకోలేక పోయింది.


సినిమా కాన్సెప్టు కొత్తగా ఏమీ లేక పోయినా... ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్టెన్ చేసే విధంగా సినిమా ఉండటం కలిసొచ్చింది. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమాను ఒకసారి చూసి బాగా నవ్వుకోవచ్చు.

English summary
Check out Manchu Mama Alludu Kanchu review.
Please Wait while comments are loading...