»   » కులం పంచాయితీ: మారకపోతే ‘జి’లో కొట్టి జైలుకు పోతానంటున్న మంచు మనోజ్

కులం పంచాయితీ: మారకపోతే ‘జి’లో కొట్టి జైలుకు పోతానంటున్న మంచు మనోజ్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Manchu Manoj Gives Strong Counter To Commenters

  మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ కుమార్ పరువు హత్యోదంతంపై స్పందిస్తూ టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ ట్విట్టర్లో చేసిన పోస్టుపై రకరకాల అభిప్రాయలు వ్యక్తం అయ్యాయి. కులం ఫీలింగ్ ఎక్కడ ఉన్నా అది చాలా దారుణం. సినిమా పరిశ్రమలో తమ కులం హీరోలను అభిమానించడమైనా, కులం ప్రాతిపదికన పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ ఇవ్వడమైనా, కులం ఆధారంగా ఏర్పడే కాలేజ్ యూనియన్స్ అయినా, మరే ఇతర కుల, మత సంఘాలైనా సమాజంలో క్రూరమైన పరిస్థితులకు కారణం అవుతున్నాయని, అలాంటి కులం పిచ్చోళ్లు ఉండబట్టే ప్రణయ్ హత్య జరిగిందని మనోజ్ అభిప్రాయ పడ్డారు.

  మనోజ్ మీద ట్రోలింగ్

  అయితే ఈ విషయంలో మనోజ్‌ను కొందరు ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో వారికి ఘాటుగా రిప్లై ఇచ్చారు ఈ మంచు స్టార్. తనతో ఈ విషయమై వాదించిన ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ నీ ఫోన్ నెంబర్ ఒకసారి ఇస్తే నా అసలైన భాషలో మాట్లాడతాను అంటూ మనోజ్ మండి పడ్డారు.

   మారకపోతే కొట్టి జైలుకు పోదాం

  మారకపోతే కొట్టి జైలుకు పోదాం

  ఈ కులం పిచ్చోళ్లు ఎప్పటికీ మారరు అన్నా... వారిని వదిలేయ్ అని ఓ అభిమాని వ్యాఖ్యానించగా దానికి మనోజ్ రిప్లై ఇస్తూ... ‘‘వాళ్లు మారక పోతే ‘జి'లో కొట్టి జైలుకు పోదాం, తొక్క'' అంటూ రిప్లై ఇచ్చారు.

  కులం పిచ్చోళ్లపై తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్

  తాను ఎన్ని చెప్పినా కొందరు కులం పిచ్చోళ్లు తమ వితండవాదం వినిపిస్తుండటంతో వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మనోజ్ ట్వీట్ చేశారు. మీ లాంటి వారు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వేరే కులానికి చెందిన డాక్టర్ దగ్గరకు ఎందుకు వెళుతున్నారంటూ మనోజ్ ప్రశ్నించారు.

  ప్రణయ్ హత్యపై మనోజ్ ట్వీట్

  ప్రణయ్‌తో పాటు ఎంతో మందిని బలిగొన్న ఈ పరిణామాలకు కులాలను, మతాలను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తులే. అలాంటి కులం, మతం పిచ్చోళ్లు సమాజంలో ఉండటం వల్లనే ఈ దారుణాలు చోటు చేసుకుంటున్నాయని మనోజ్ అన్నారు. మనిషి జీవితం కంటే మరేదీ ఎక్కువ కాదనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. తన తండ్రిని స్పర్శించక ముందే ఒక బిడ్డ కన్న తండ్రిని కోల్పోవడం మనస్సును కలచి వేసే అంశం. కేవలం కులం కోసం వాళ్ల జీవితాలను చిన్నాభిన్నం చేశారు. వారి జీవితాల కంటే మీకు కులమే ఎక్కువా? దీని వల్ల మీరు సాధించింది ఏమిటి? అని మనోజ్ ప్రశ్నించారు.

  English summary
  "Anyways ... signing off for the day ... Congrats to all the caste fanatics who helped killing #Pranay ... Remember one thing, Humanity is the only Reality ..... eat well and sleep well or else u might have to go and beg a doctor who is from a different caste ... Good Night🙏🏻" Manchu Manoj tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more