వేరే కులం వారు నెగిటివ్ రూమర్స్ తో..: మంచు మనోజ్

By Srikanya

హైదరాబాద్: "ప్రస్తుతం తెలుగులో హీరోల ఫ్యాన్స్ కులాలతో వేరు చేసి సినిమాలను చూస్తున్నారు. ఇది చాలా భాధాకర విషయం. ఇదే పరిస్దితి కొనసాగితే తెలుగు సినిమా నెక్ట్స్ లెవెల్ కి చేరుకోవటం కష్టం. వేరే కులానికి చెందిన హీరో చిత్రం విడుదల అయితే వెంటనే ఫ్యాన్స్ నెగిటివ్ గా రూమర్స్ స్పెడ్ చేస్తున్నారు. ఇది కరెక్టు పద్దతి కాదు. కులం దృష్టిలో సినిమాలు చూడద్దు..తెలుగు వాడిగా సినిమాలు చూడండి. మనం కులాలని వదిలేస్తే తప్పకుండా తెలుగు సినిమాని బాలీవుడ్,హాలీవుడ్ రేంజికి తీసుకు వెళ్లగలం" అన్నారు మంచు మనోజ్. తన తాజా చిత్రం ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఈ శుక్రవారం విడుదల సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

"అలాగే 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. నాలుగేళ్ల మా టీమ్ కల నిజమవుతోంది. మా టీమ్ ని ఎంకరేజ్ చేయండి అని ట్వీట్ చేసారు. అలాగే మా సినిమా కు విపరీతమైన క్రేజ్ రావటంతో డిస్ట్రిబ్యూటర్స్ ప్రింట్స్ పెంచమని అడుగుతున్నారు అన్నారు. ఇది ప్రింట్స్ పెంచటం అనేది పూర్తిగా డిస్ట్రిబ్యూటర్స్ ఛాయిస్" అని మంచు మనోజ్ ఈ సందర్భంగా చెప్పారు.

బాలకృష్ణ మాట్లాడుతూ...'శ్రీరామరాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ వరం' అని అన్నారు. అలాగే ఊ కొడతా రా... ఉలిక్కి పడతారా చిత్రం భారీ ఎత్తున తెరకెక్కింద?"న్నారు. "ఈ చిత్రాన్ని మంచు లక్ష్మీప్రసన్న నిర్మించింది. ఈ చిత్రం కోసం రూ.6 కోట్ల వ్యయంతో గంధర్వ మహల్ సెట్‌ను వేసిన"ట్లు చెప్పారు. మంచు మనోజ్ మరో హీరోగా చక్కగా నటించారని బాలకృష్ణ ప్రశంసించారు. ఊ కొడతారా... ఉలిక్కి పడతారా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రం అవుతుందన్నారు.

మంచు ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పద్మశ్రీ డా.ఎం. మోహన్ బాబు సమర్పణలో మంచు మనోజ్, దీక్షాసేత్ హీరో హీరోయిన్లుగా శేఖర్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దర్శకుడు శేఖర్ రాజా చెప్పిన పాత్రలోని ఉదాత్తతకు ఆకర్షితులై 'ఊ కొడతారా..ఉలిక్కిపడతారా'లో నటించడానికి నందమూరి బాలకృష్ణ అంగీకరించారని చెప్తున్నారు. బాలకృష్ణ, ప్రభు, మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి సంగీతం బెబో శశి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X