అల్లు అర్జున్ తో ఆ రేంజ్ ఊహించుకోవద్దు
మేమిద్దరం కలిసి పనిచేసింది చాలా తక్కువే. ఈ సినిమాలో మేమిద్దరం చేస్తున్నాం కాబట్టి అంతా 'బిల్లా-రంగా', 'పట్నం వచ్చిన పతివ్రతలు' తరహాలో ఏవేవో ఊహించేసు కుంటున్నారు. ఆ రేంజ్‌లో అస్సలు ఊహించుకోవద్దు అంటున్నారు మంచు మనోజ్ తన తాజా చిత్రం 'వేదం' గురించి. ఈ రోజు (గురువారం) పుట్టిన రోజు సందర్బంగా మనోజ్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే...'వేదం'లో వివేక్ చక్రవర్తి అనే రాక్ స్టార్ పాత్ర చేశా. నిజానికి ఇది సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ లాంటిది. నా పాత్రతోటే సినిమా మొదలయ్యి, నా పాత్రతోటే ముగుస్తుంది. క్రిష్ బ్రిలియంట్ డైరెక్టర్. స్క్రిప్టుని నమ్ముకుని ఒక తపనతో సినిమా చేసే అతనితో పనిచెయ్యడం హ్యాపీ. ఈ సినిమాలో వ్యక్తిగతంగా నాకు ముసలాయన నాగయ్య చేసిన రాములు పాత్ర, ఆ తర్వాత అనుష్క చేసిన అమలాపురం సరోజ పాత్ర బాగా నచ్చాయి. బన్నీది కేబుల్ రాజు అనే మాస్ పాత్ర. చాలా బాగా చేశాడు. ఇందులో ఓ కొత్త బన్నీని చూస్తారు అని హామీ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











