మోడీ రాజకీయాల్లోకి రమ్మన్నారు, మీడియాతో మంచు మనోజ్
హైదరాబాద్: ప్రధాని మోడీ తనను రాజకీయాల్లోకి రమ్మని అడిగారు, నేను ఆలోచించి చెబుతానను అన్నాను........ అంటూ వ్యాఖ్యానించిన మంచు మనోజ్, వెంటనే ఓ నవ్వు నవ్వి జస్ట్ జోక్ చేసాను అంటూ మీడియాకు షాకిచ్చారు. మోడీని కలవడం వెనక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నకు మంచు మనోజ్ పై విధంగా స్పందించారు.
తన పెళ్లి శుభలేఖను ప్రధాని మోడీకి అందించేందుకు తన ఫ్యామిలీతో కలిసి వచ్చిన ఆయన మోడీని కలిసిన అనంతరం ఢిల్లీలోని తెలుగు మీడియాతో మాట్లాడారు. మోడీని గొప్ప నేతగా అభివర్ణించారు. ఎంతో గ్రాండ్ గా రీసీవ్ చేసుకున్నారు. ఆయన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఇటీవలే మనోజ్ నిశ్చితార్థం ప్రణతి రెడ్డితో జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 4, ఉదయం 10.30 గంటలకు ఎంగేజ్మెంట్ జరిగింది. మనోజ్-ప్రణతి వివాహానికి పురోహితులు మే 20వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం జరగనుంది. మరో విశేషం ఏంటంటే మనోజ్ పుట్టిన రోజు కూడా మే 20వ తేదీయే. ప్రణతి రెడ్డిని మనోజ్ ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











