గుర్తుండి పోయే దెబ్బ, కేటీఆర్ ఫోటో వైరల్.. ఒక్క బులెట్‌తో ఇంతమందా.. మంచు మనోజ్!
తెలంగాణ ఎన్నికల ఫీవర్ సినీ వర్గాలకు కూడా అంటుకుంది. పోలింగ్ ముందు రోజునుంచే సినీ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని క్యాంపైన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాజమౌళి, కొరటాల శివ లాంటి అగ్ర దర్శకులు.. వరుణ్ తేజ్, ఎన్టీఆర్, నితిన్, రామ్ లాంటి హీరోలంతా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీ ఏకపక్ష విజయం కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

గురిపెట్టిన కేటీఆర్
ప్రస్తుతం సోషల్ మీడియాలో కేసీఆర్ తనయుడు, టిఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. తుపాకీ గురిపెట్టి చూస్తున్న కేటీఆర్ ఫోటో స్టైలిష్ గా ఉంది. ట్విట్టర్ లో సరిగ్గా ఎన్నికల ఫలితాలకు ముందు కేటీఆర్ తన డిపి చేంజ్ చేశారు. ఈ ఫోటో నెటిజన్లని మాత్రమే కాదు సినీ తరాలని సైతం ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ ఫోటోపై రచయిత కోన వెంకట్, దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు.
ఒక్క బులెట్‌తో ఇంత మందా
తెలంగాణ ఎన్నికల ఫలితాలు, కేటీఆర్ ఫోటోపై హీరో మంచు మనోజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఒక్క బులెట్ తో ఇంత మందా.. ఇది గుర్తుండిపోయే దెబ్బ.. శుభాకాంక్షలు బ్రదర్ కేటీఆర్ గారు అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. తెలంగాణ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం కోసం మరోమారు ఎదురుచూస్తున్నాము అంటూ మనోజ్ పేర్కొన్నాడు.

చిత్ర పరిశ్రమతో
2014 లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టాలీవుడ్ తో కేటీఆర్ మంచి సన్నిహిత సంబంధాలని కొనసాగిస్తున్నారు. చిత్ర పరిశ్రమలోనే అన్ని కుటుంబాలతో కేటీఆర్ మంచి రిలేషన్ షిప్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరుపున కూడా టాలీవుడ్ కు సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య కేటీఆర్ వారధిలా పనిచేశారనే కామెంట్స్ వినిపించాయి.

సినిమా వేడుకలకు
రాంచరణ్, మహేష్ బాబు లాంటి హీరోలంతా తనకు మంచి స్నేహితాలని కేటీఆరే స్వయంగా గతంలో వెల్లడించారు. పలు చిత్రాల వేడుకలకు కూడా కేటీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. దీనితో వరుసగా రెండవ సారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుండడంతో సినీ సెలెబ్రిటీలు కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











