నా ప్రాణం అయిన మా నాన్న పుట్టిన రోజు.. రియల్ హీరో అనిపించుకున్న మంచు మనోజ్!
Recommended Video

మంచు వారబ్బాయి మనోజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. అనేక సామజిక, రాజకీయ అంశాలపై మంచు మనోజ్ తన అభిప్రాయాలని ప్రజలతో పంచుకుంటుంటాడు. మంచు మనోజ్ చివరగా నటించిన ఒక్కడు మిగిలాడు చిత్రం తర్వాత మరో ప్రాజెక్ట్ ప్రారంభించలేదు. నేడు మోహన్ బాబు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన తండ్రి బర్త్ డే సందర్భంగా మంచు మనోజ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

69వ జన్మదినం
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నేడు 69వ పడిలోకి అడుగుపెట్టారు. మోహన్ బాబు దశాబ్దాల కాలంగా టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఎప్పటికి గుర్తుండిపోయే కార్యక్రమం చేయాలని మంచు మనోజ్ భావించాడు. అందుకు తగ్గట్లుగానే తాను ఏం చేయబోతున్నానో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. సామజిక అంశాలపై మంచు మనోజ్ తరచుగా బాధ్యతతో స్పందిస్తుంటాడు. తాజా మనోజ్ తీసుకున్న నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు.
చిన్నారిని దత్తత
మనోజ్ సిరిసిల్లకు చెందిన ఓ అశ్విత అనే చిన్నారిని దత్తత తీసుకున్నాడు. ఈ విషయాన్ని మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. నేను ప్రాణంగా భావించే నాన్న బర్త్ డే సందర్భంగా ఏదైనా మంచి పని చేయాలని అనిపించింది. చిన్నారి అశ్వితని దత్తత తీసుకున్నందుకు గర్వపడుతున్నా. ఐఏఎస్ కావాలనేది తన కోరిక. ప్రస్తుతం అశ్వితని విద్యానికేతన్ స్కూల్ లో చేర్పించా. బాగా చదివించి ఐఏఎస్ ని చేస్తా అని మనోజ్ తెలిపాడు.

ఒత్తిడికి గురిచేయొద్దు
మంచు మజాన్ నిర్ణయాన్ని ఓ నెటిజన్ అభినందించాడు. ఐఏఎస్ కావాలని చిన్నారిని ఒత్తిడికి గురిచేయొద్దు. అది ఆమె కల అని తెలుసు. కానీ వయసు పెరిగేకొద్దీ ఆశయాలు కూడా మారుతుంటాయి అని సదరు నెటిజన్ మనోజ్ కు సూచించాడు. దీనికి మనోజ్ సమాధానం ఇస్తూ.. ఐఏఎస్ కావాలనేది ఆమె కోరిక.. నేను ఎవర్ని డిసైడ్ చేయడానికి.. మంచి జీవితం మాత్రం ఇవ్వగలనని చెబుతున్నా అని తెలిపాడు.

పెరిగిన గ్యాప్
ఇక సినిమాల విషయానికి వస్తే మంచు మనోజ్ కు ఇటీవల వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దీనితో తదుపరి చిత్రానికి బాగా గ్యాప్ పెరిగింది. తన నెక్స్ట్ మూవీ ఏంటనే విషయాన్ని మంచు మనోజ్ ఇంకా ప్రకటించలేదు. బహుశా మంచి కథ ఎంచుకునేందు ఇంకా టైం తీసుకుంటాడేమో. గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి.


Click it and Unblock the Notifications











