Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మేనకోడలని ముద్దు చేస్తూ మంచు మనోజ్(ఫొటో)
హైదరాబాద్ : చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా ఎత్తుకుని ముద్దెట్టుకోవాలనిపిస్తుంది. అలాంటిది...ఇక మేనమామ,మేనత్త, అమ్మ,నాన్న,తాత వంటి రక్త సంభందీకులకైతే మరీను. ఈ ప్రేమాభిమానాలకు సెలబ్రెటీలుసైతం అతీతలు కాదు. రీసెంట్ గా మంచు లక్ష్మి కి ఓ పాప పుట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు మంచు ఫ్యామిలీలో ఆ పాప స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. ఆమె మేనమామ అయిన మంచు మనోజ్ ఇలా ఎత్తుకుని ముద్దు చేస్తున్నాడు.
పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో హిట్ కొట్టి ఉత్సాహంలో ఉన్న మంచు మనోజ్ తన తదుపరి చిత్రం కరెంట్ తీగతో ప్లాఫ్ ఇచ్చారు. ఇప్పుడు మరో చిత్రానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రం టైటిల్ సన్నాఫ్ పెద రాయుడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో నడుస్తుందని చెప్తున్నారు.
మోహన్‌బాబు కెరీర్‌లో కలికితురాయి లాంటి సినిమా ‘పెదరాయుడు'.బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధించిన గొప చిత్రమిది. అంతేకాదు డైలాగ్‌కింగ్‌ని ఓ రేంజులో చూపించారీ చిత్రంలో. ఈ సినిమాకి సీక్వెల్ ‘సన్నాఫ్ పెదరాయుడు'.కొత్త దర్శకుడు సాగర్ పసల దర్శకత్వం వహిస్తారని, అమెరికా షెడ్యూల్ మొదలవుతోందని తెలుస్తోంది. ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ-‘‘హాలీవుడ్‌లో మోషన్ పిక్చర్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వంలో శిక్షణ పొంది, హాలీవుడ్‌లో ‘డార్క్ ఫీల్డ్స్' చిత్రానికి అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేసి, తెలుగులో ‘కిక్' సురేందర్‌రెడ్డి వద్ద పలు చిత్రాలకు పనిచేసిన పి.సాగర్‌ని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మంచు మనోజ్‌తో నిర్మిస్తున్న ఈ ‘సన్నాఫ్ పెదరాయుడు' అతి త్వరలో ప్రారంభం అవుతుంది. మనోజ్ కెరీర్‌ని కొత్త మలుపు తిప్పే వైవిధ్యమైన కథతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తాం''అన్నారు.