For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మంచు మనోజ్‌ సంగీత దర్శకుడుగా ఎంట్రీ

  By Srikanya
  |

  దరాబాద్ : రీసెంట్గా ఊ కొడతారా...ఉలిక్కిపడతారా చిత్రంతో పలకరించిన మంచు మనోజ్‌ కేవలం నటనకే పరిమితం కాదలుచుకోలేదు. ఆయన ఇప్పుడు ఓ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన సోదరుడు విష్ణు సినిమా కోసం ఆయనో పాట స్వరపరిచారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం 'దేనికైనా రెడీ'. హన్సిక కథానాయిక. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి చక్రి స్వరాలు అందించినా- ఓ పాట కోసం మనోజ్‌ బాణీ కట్టారు అందరినీ ఆశ్చర్యపరిచారు.

  మంచు విష్ణు మాట్లాడుతూ ''మనోజ్‌ స్వరపరచిన గీతం ప్రత్యేకమైనది. ఉర్రూతలూగించేలా సిద్ధమైంది. కథలో ఆ పాట చక్కగా ఒదిగిపోతుంది. వినోద ప్రధానంగా సాగే చిత్రమిది. తన ప్రేమని గెలిపించుకోవడం కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమయ్యే ఓ యువకుడి కథ ఇది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఆ పాటల్ని యూరప్‌లో తెరకెక్కిస్తామ''అన్నారు.
  హన్సిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా నాగేశ్వరరెడ్డి మలుస్తున్నారు. యువతరాన్ని ఆకట్టుకునే విధంగా హన్సిక పాత్ర ఉంటుంది. క్లైమాక్స్, రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది.

  ఇక ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి...వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.

  ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్‌బాబు.

  English summary
  
 Hero Manchu is going to be composer for the upcoming film of hero Manchu Vishnu. Music directors close proximity with other Manchu, Manchu Manoj I said to be the reason for this guest compositions. Yuvan will provide two songs to the film which has Chakri as music director. Denikaina ready is directed by G Nageshwara Reddy and is said to be laugh riot on the lines of Dhee.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X