ఆ గ్రాఫిక్ ఫొటోకీ మంచు మనోజ్ కీ సంభందం ఏమిటీ?

By Manchu Manoj | Vu Kodatara Vulikki Padatara | Raja | Lakshmi Prasanna | ఆ గ్రాఫిక్ ఫొటోకీ మంచు మనోజ్

మంచు మనోజ్ కుమార్ ని హీరోగా "ఊ కొడతారా..ఉలిక్కి పడతారా!?" అనే టైటిల్ తో ఓ కామిక్ ధ్రిల్లర్ చిత్రం మొదలవనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథకీ పైన చూపిన ఫోటోకి సంభందం ఉందని, సినిమాలో ఈ ఫొటో కీలకపాత్ర పోషిస్తుందని తాజాగా మంచు మనోజ్ ట్విట్టర్ లో ఈ ఫొటోని పెట్టి పోస్ట్ చేసారు. ఇక ఈ విధంగా క్యూరియేసిటీ లేపే ప్రయత్నం చేస్తున్న మనోజ్ ఈ చిత్రాన్ని అతి త్వరలోనే అంటే అక్టోబర్ లోనే ప్రారంభిస్తానంటున్నాడు. కొత్త తరహా కథ, కథనంతో ఈ స్క్రిప్టు ముందుకెళ్ళనుంది. ఇక ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రాన్ని మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న..తమ సొంత బ్యానర్ పై నిర్మించనుంది. ఈ చిత్రం గురించి మనోజ్ మాట్లాడుతూ..కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన రాజా దర్శకత్వంలో 'ఊకొడతారా..ఉలిక్కిపడతారా" అనే పేరుతో సంపూర్ణ హాస్య రసభరిత చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఆ చిత్రం వుంటుంది అని అన్నారు. బిందాస్ చిత్రంతో ఓకే అనిపించుకున్న మనోజ్ తర్వాత వచ్చిన వేదంతో నటుడుగానూ ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఝుమ్మంది నాదం చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిలయింది. ఆ తర్వాత ఇప్పుడు వేదం తమిళ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక ఈ కామిడి ధ్రిల్లర్ తో అయినా మనోజ్ కమర్షియల్ హరోగా నిలబడాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X