బాలకృష్ణ, మనోజ్ మూవీ ఆడియో వాయిదా
నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్యమైన అతిథి పాత్రలో మనోజ్, దీక్షాసేథ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఊ కొడతారా ఉలక్కి పడతారా'. సోషియో ఫాంటసీ కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో వేడు ఈ రోజు(మే 26)న శిల్పకళా వేదికలో జరుగాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు. త్వరలోనే ఆడియో రిలీజ్‌కు సంబంధించిన వివరాలు తెలియజేస్తామని మంచు మనోజ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ చిత్రం కోసం రూ. 6.5 కోట్లు వెచ్చించి వేసిన గాంధర్వ మహల్ సెట్‌తో ఫస్ట్ లుక్‌లో అధ్బుతంగా చూపించారు. ఈచిత్రంలో బాలకృష్ణ జమిందార్ నరసింహ నాయుడుగా కనిపించనున్నాడు.
తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం 6.5 కోట్లతో గాంధర్వ మహల్ సెట్టింగ్ వేయడం ఇప్పుడు పరిశ్రమ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది. లక్ష్మి అంత ఖర్చు పెట్టి సెట్ వేసి సాహసం చేస్తుండటం చర్చనీయాంశం అయింది. అయితే బాలయ్య క్యారెక్టర్ గురించే ఆ సెట్ వేశారట. ఇందులో ఆయన జమిందార్ పాత్రలో కనిపించబోతున్నారు. బాలయ్య కు ఉన్న ఫాలోయింగ్‌తో సినిమా హిట్ అవుతుందనే నమ్మకంలో ఉన్నారంతా.
ఈ చిత్రంలో బాలకృష్ణ ఆత్మగా కనపడతారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. చంద్రముఖి తరహా గాంధర్వ మహల్ భవంతిలోకి హీరో మనోజ్ ప్రవేశించాక కథ మొదలవుతుందని, అక్కడ బాలకృష్ణ ఆత్మ కలుస్తుందని చెప్పుకుంటున్నారు. హర్రర్,కామెడీ కలగలిసే ఈ సన్నివేశాల్లో బాలకృష్ణ ప్లాష్ బ్యాక్ విన్న హీరో....ఆయన ఆశయం తీర్చటమే సినిమా ప్రధాన కథాంశం అంటున్నారు. ఈ చిత్రాన్ని కృష్ణ వంశీ శిష్యుడు శేఖర్ రాజా రూపొందిస్తున్నారు. మంచు లక్ష్మి నిర్మాత.


Click it and Unblock the Notifications











