»   » హడావుడి మామూలుగా లేదుగా: మంచు మనోజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

హడావుడి మామూలుగా లేదుగా: మంచు మనోజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్ నేడు పుట్టిరోజు వేడుక జరుపుకుంటున్నాడు. మరో విశేషం ఏమిటంటే ఇదే రోజు మంచు మనోజ్ తొలి పెళ్లి రోజు. దీంతో మంచు అభిమానులు, మనోజ్ ఫాలోవర్స్ భారీగా ఏర్పాట్లు చేసారు. మనోజ్ నివాసం వద్ద హడావుడి చూసిన వారంతా వామ్మో! అని ఆశ్చర్యపోక తప్పదు.

మంచు మనోజ్ ఇంటికి వచ్చే దారిలో భారీగా ప్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేసారు. మనోజ్ ఇంటి చుట్టూ బర్త్ డే, మ్యారేజ్ డే బేనర్లతో నింపేసారు ఫ్రాన్స్. మనోజ్ నివాసం బయటే కేక్ కటింగ్ ఏర్పాటు చేసారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో మనోజ్ అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు.

ఈ వేడుకలో మంచు మనోజ్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంచు మనోజు కేక్ కట్ చేస్తుంటే టపాసులు పేలుస్తూ, పూలు, రంగు కాగితాలు చల్లుతు గోల గోల చేసారు. ఆ దారి వెంట వెళ్లే సామాన్య జనం ఈ హడావుడి చూసి ఆశ్చర్య పోయారు.

మంచు మనోజ్ గతేడాది ఇదే రోజున ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పుట్టినరోజునే పెళ్లి జరుగడంతో మనోజ్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయలేక పోయారు ఫ్యాన్స్. అందుకే ఈ సారి ఏర్పాట్లు అదరగొట్టారు.

స్లైడ్ షోలో ఫోటోస్...

మంచు పోస్టర్లు

మంచు పోస్టర్లు

మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ పోస్టర్లు.

పుట్టినరోజు, పెళ్లి రోజు బేనర్లు

పుట్టినరోజు, పెళ్లి రోజు బేనర్లు

మంచు మనోజు పుట్టినరోజు, పెళ్లి రోజు ఒకటే కావడంతో భారీ బేనర్లు ఏర్పాటు చేసారు.

రోడ్డంతా హోర్డింగులే

రోడ్డంతా హోర్డింగులే

మంచు మనోజ్ ఇంటికి వెళ్లే దారిలో ఇలా భారీ స్థాయిలో హోర్డింగులు ఏర్పాటు చేసారు.

మనోజ్ నివాసం వద్ద

మనోజ్ నివాసం వద్ద

మంచు మనోజ్ నివాసం వద్ద అభిమానుల సందడి.

మనోజ్

మనోజ్

అభిమానులకు అభివాదం చేస్తూ వస్తున్న మనోజ్.

కేక్ కటింగ్

కేక్ కటింగ్

మనోజ్ నివాసం బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.

మనోజ్

మనోజ్

తన పుట్టినరోజున విష్ చేసేందుకు వచ్చిన అభిమానులకు మంచు మనోజ్ అభివాదం.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

తన కూతురుతో కలిసి మంచు లక్ష్మీ ప్రసన్న.

మరో గ్రూఫు

మరో గ్రూఫు

మరో ఫ్యాన్ గ్రూఫ్ ఆధ్వర్యంలో మనోజ్ కేక్ కటింగ్.

English summary
Check out photos of MANCHU MANOJ BIRTH DAY CELEBRATIONS.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu