ప్రతీ విషయంలో తోడుంటాడు.. అన్నపై మంచు మనోజ్ ప్రేమ
ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఓ విశిష్టత ఉంది. మోహన్ బాబు క్రమశిక్షణ ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని మంచు లక్ష్మీ, మంచు విష్ణు, మంచు మనోజ్ తెరంగేట్రం చేశారు. సినీ కెరీర్ ఎలా ఉన్నాగానీ వీరంతా కలిసి మెలిసి ఉంటారు. పండగపబ్బాలకు చేసే సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. అందరూ ఒక చోట చేరారంటే అక్కడ సంబరాలు మిన్నంటాల్సిందే. ప్రస్తుతం లాక్‌డౌన్ ఉండటంతో అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు.ఈ లాక్‌డౌన్ మంచు వారు ఎన్నెన్నో కొత్త కొత్త వింతలు సృష్టించారు.
మంచు విష్ణు వంటగదిలో గరిట తిప్పాడు. ప్రత్యేకమైన వంటకాలు వండి అందరికీ వడ్డించారు. మోహన్ బాబు సైతం పిల్లలకోసం వంటలు వండాడు. ఈ క్వారంటైన్ సమయాన్ని అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మంచు లక్ష్మీ తన కూతురు విద్యతో కలిసి సందడి చేస్తోంది. సాయంత్రం మిద్దె మీద పట్టెమంచెం వేసుకుని చందమామను చూస్తు చిన్ననాటి సంగతులను నెమరు వేసుకుంటూ ఉన్న వీడియో షేర్ చేయగా..అ ది తెగ వైరల్ అయింది. తాజాగా మంచు లక్ష్మీ, మనోజ్ షేర్ చేసిన ఫోటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి.

నేడు బ్రదర్స్ డే. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ తన సోదరులపై ప్రేమను కురిపించింది. 'పక్కపక్కన ఉన్నా.. దూరంలో ఉన్నా.. బ్రదర్స్ సిస్టర్స్ ఎప్పుడూ మనసుకు దగ్గరగానే ఉంటారు. నా ప్రియమైన ఇద్దరు సోదరులే నా బలం, నా శక్తి. వీరికే కాకుండా బయటున్నా నా సోదరులందరికీ అమితమైన ప్రేమ, అపారమైన సంతోషం కలగాలని కోరుకుంటున్నా'ని చెప్పుకొచ్చింది.
మంచు మనోజ్ కూడా బ్రదర్స్ సందర్భంగా అన్న మంచు విష్ణుపై ప్రేమను కురిపించాడు. అన్నివేళలా ఎత్తుపల్లాల్లో నా వెంట ఉండే నా అన్నకు సలామ్. మా అన్న మంచు విష్ణుకు, దేవుడిచ్చిన అభిమాన సోదరులందరికీ హ్యాపీ బ్రదర్స్ డే అని పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











