'బిందాస్' లో మనోజ్ క్యారెక్టర్ ఏంటంటే...
మనల్ని ఇష్టపడిన వారిని ఇష్టపడటం మంచితనం. మనల్ని ఇష్టపడనివారిని కూడా ఇష్టపడటం గొప్పతనం. ఈ గొప్పతనం మా సినిమాలో అజయ్ కేరెక్టర్‌లో ఉంది అంటూ దర్శక, రచయిత వీరూపోట్ల తన 'బిందాస్' చిత్రం గురించి చెప్పుకొచ్చారు. ఈ చిత్రం ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్బంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. నిర్మాత సుంకర రామబ్రహ్మం మాట్లాడుతూ...'ఈ సినిమాకి అజయ్ గాడి విజయగాథ అని కాప్షన్ పెట్టాం. ఈ చిత్రకథాంశాన్ని ఇది చెప్పక చెబుతుంది. క్లైమాక్స్‌లో డూప్ లేకుండా మనోజ్ చేసిన ఫైట్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది' అలాగే ఈ సినిమాలో సరికొత్త మనోజ్ ని చూడవచ్చు అన్నారు. మంచు మనోజ్‌కుమార్, షీనా జంటగా ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై 'బిందాస్' చిత్రం రూపొందింది. 35 మంది ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రానికి పాటలు: భువనచంద్ర, రామజోగయ్య శాస్త్రి, ఫొటోగ్రఫీ: రమేష్ బాబు, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గరికపాటి కృష్ణకిషోర్, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వీరూ పోట్ల.వీరూ పోట్ల గతంలో వర్షం, నువ్వు వస్తానంటే నే వద్దంటానా, సంతోషం వంటి చిత్రాలకు కథలు అందించారు.


Click it and Unblock the Notifications











