ఏం చేయబోతున్నానో 15 రోజుల్లో చెబుతా: మంచు మనోజ్
మంచు మనోజ్ హైదరాబాద్ నుంచి తిరుపతి షిప్ట్ అవుతున్నట్లు, ఇకపై సేవా కార్యక్రమాల్లో బిజీ కాబోతున్నట్లు ట్వీట్ చేయడంతో ఆశ్చర్యపోయారు. మనోజ్ సినిమాలను వదిలేసి రాజకీయాల బాట పడుతున్నారంటూ ప్రచారం మొదలైంది. హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్న అనంతరం మనోజ్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు.
''నా ట్వీట్ అందరూ చూసే ఉంటారు. అందులో చెప్పినట్లు తిరుపతికి రావడం జరిగింది. అందరూ నన్ను ప్రేమగా రిసీవ్ చేసుకుని క్యాంపస్‌కు తీసుకొచ్చారు. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది, లెటర్లో రాసింది ఒకేట. సినిమాలకు ఉప్పటికీ దూరం కాను, కాలేను. సినిమా మూడు నెలల్లో మొదలు పెట్టబోతున్నాను''... అని మనోజ్ తెలిపారు.

ఏం చేయబోతున్నానో 15 రోజుల్లో
ఈ మూడు నెలల సమయంలో నేను మా ఊర్లో ఉంటూ ఇక్కడి నుంచి ఒక అద్భుతమైన ప్లాన్‌తో నేనూ నా ఫ్రెండ్స్ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అదేమిటో చెప్పే సందర్భంగా ఇది కాదు. 15 రోజుల్లో పెద్దవాళ్లతో కూర్చుని ఏం చేయబోతున్నాను అనేది క్లియర్ గా వివరిస్తాను అన్నారు.

రాజకీయాలతో సంబంధం లేదు
దీనికంటే ముందు మరో ముఖ్య విషయం. రాజకీయాలకు నాకు ఏ మాత్రం సంబంధం లేదు. అటు పక్కకు కూడా రావడం లేదు. దయచేసి ఈ విషయమై ఎలాంటి ప్రచారం చేయొద్దు.... అని ఈ సందర్బంగా మంచు మనోజ్ స్పష్టం చేశారు.

హెల్ప్ చేద్దామనే వచ్చాను
సంతోషంగా పది మందికి ఉపయోగపడేలా హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుందామని వచ్చానే తప్ప మరో ఉద్దేశ్యం కాదు. ఎవరి పనులు వారు చేసుకుందామని మనోజ్ వ్యాఖ్యానించారు.

రాగి సంకటి, మటన్ పులుసు రెడీగా పెట్టండి అంటూ మనోజ్ లేఖ
నా జీవితాన్ని ఈ నేల యువతకు అంకితం చేస్తున్నాను. రాయలసీమ వస్తున్నాను రాగి సంకటి, మటన్ పులసు రెడీగా పెట్టండి అంటూ మనోజ్ అంతకు ముందు తన ట్విట్టర్లో తెలిపారు. తిరుపతి నుంచి మొదలయ్యే సేవా కార్యక్రమాలు ఈ ప్రపంచమంతా చేరువ అయ్యేలా తపిస్తాను. ముందుగా ఇక్కడి యువతకి సహాయపడేలా ఏదైనా చేస్తాను అని మనోజ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











