విడాకులతో గుండె బరువెక్కింది.. భార్యతో విభేదాలపై మంచు మనోజ్ క్లారిటీ

Recommended Video

Manchu Manoj Divorce With His Wife || ఇంక కలిసి బ్రతకలేకే.. మంచు మనోజ్ ట్వీట్

డైలాగ్ కింగ్ మంచు మోహన్ నట వారసుడిగా టాలీవుడ్‌లోకి ప్రవేశించిన మంచు మనోజ్ గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తన వ్యక్తిగత జీవితంలో కొన్ని కలతలు చోటుచేసుకోవడంతో మీడియాకు దూరంగా కూడా ఉంటున్నారు. భార్య ప్రణతిరెడ్డితో విభేదాలు చోటుచేసుకొన్నాయనే వార్తలపై పెద్దగా స్పందించలేదు. కానీ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ చేదు వార్తను అభిమానులతో షేర్ చేసుకొన్నారు. మంచు మనోజ్ షేర్ చేసుకొన్న విషయాలు మీ కోసం..

భారంగా నా హృదయం

భారంగా నా హృదయం

నా వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకొంటున్నాను. ప్రస్తుతం నా హృదయం చాలా భారంగా మారింది. నా భార్యతో చట్టబద్ధంగా విడాకులు తీసుకొన్నాను. పరస్పర అవగాహన మేరకు కోర్టు తీర్పుతో మా అందమైన వైవాహిక జీవితానికి తెరపడింది అని మంచు మనోజ్ ఆవేదనతో కూడిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వైవాహిక జీవితంలో విభేదాలు..

వైవాహిక జీవితంలో విభేదాలు..

మా వైవాహిక జీవితంలో చోటుచేసుకొన్న విభేదాలు మాకు ఎంతో బాధకు గురిచేశాయి. మా మధ్య చోటుచేసుకొన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. చాలా రకాలుగా చర్యలు తీసుకొన్నాం. అయినప్పటికీ మేము విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాం. మా దాంపత్యపరమైన విభేదాలే కానీ.. వ్యక్తిగతం మా మధ్య రిలేషన్స్ బాగున్నాయి. మా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని ఆశిస్తున్నాం అని మనోజ్ తన లేఖలో పేర్కొన్నారు.

మనసు అల్లకల్లోలంగా

మనసు అల్లకల్లోలంగా

ప్రస్తుతం నా జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలతో నా మనసు అల్లకల్లోలంగా ఉంది. అందుకే యాక్టింగ్‌కు, ఇతర పనులకు దూరంగా ఉంటున్నాను. నా జీవితంలో స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు, కుటుంబ సభ్యుల సహకారం లేకుంటే ఇప్పుడు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి బయటపడే వాడిని కాదేమో అని మంచు మనోజ్ ఎమోషనల్‌గా లేఖను రాశారు.

కష్టకాలంలో అండగా.. తోడుగా

ఇలాంటి కష్టకాలంలో నాకు తోడుగా, అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటాను. త్వరలోనే మరింత శక్తిని కూడగట్టుకొని నటనారంగంలోకి వస్తాను. ఈ క్రమంలో నన్ను అర్ధం చేసుకోవాలని అభిమానులను కోరుకొంటున్నాను. సినిమాలే నాకు ప్రపంచం. భగవంతుడు, మీ దీవెనలతో నా చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను అని మనోజ్ తన లేఖలో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X