భార్యకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది.. వీడియో తీసి పంపించండి: మంచు మనోజ్
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ భూతం నుంచి తప్పించుకోవాలంటే ప్రతీ ఒక్కరు స్వతహాగా సెల్ఫ్ క్వారంటైన్ (స్వీయ నిర్బంధం) లోకి వెళ్లడమే ఉత్తమమైన, ఏకైక మార్గమని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇందులో భాగంగానే జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ లాంటి కీలక చర్యలు తీసుకుంటోంది గవర్నమెంట్.
ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్నీ వాయిదా వేసుకున్నారు. చాలామంది సినీ సెలబ్రిటీలు సెల్ఫ్ క్వారంటైన్ (స్వీయ నిర్బంధం) విదించుకున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ఇంటి గడపదాటి బయట అడుగు పెట్టకుండా ఉంటున్నారు మోహన్ బాబు. ఈ సమయాన్ని తన భార్య నిర్మలా దేవికి సపర్యలు చేస్తూ వినియోగిస్తున్నారు.

మోహన్ బాబు భార్య సోఫాలో నిద్రిస్తుండగా ఆయన విసనకర్రతో ఊపుతూ సేవ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను మోహన్ బాబు స్వయంగా షేర్ చేయగా.. ఇప్పుడు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్ చేశాడు.
భార్యకు సేవ చేసుకునే అవకాశం వచ్చిందని, సేవలు చేయించుకోవడానికి వారు అర్హులని పేర్కొన్న మంచు మనోజ్.. ప్రతి ఒక్కరు తన తండ్రిలాగే భార్యకు సపర్యలు చేయాలని అన్నాడు. ఇలాంటి క్వారంటైన్ మూమెంట్‌లను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయండని ఆయన చెప్పాడు.


Click it and Unblock the Notifications











