దాడి ఘటనపై మంచు మనోజ్ తీవ్రంగా...
హైదరాబాద్: ‘జబర్దస్త్' వేణుపై గౌడ సంఘాల నేతలు దాడి చేసిన సంఘటనపై నటుడు మంచు మనోజ్ తీవ్రంగా స్పందించారు. దాడి ఘటనను చౌకబారు చర్యగా, అమానవీయ చర్యగా పేర్కొన్నారు. కులం, మతం కంటే ముందు....మనం మనుషులమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.
ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని గౌడ సంఘాల నేతలు వేణుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. వేణుపై జరిగిన దాడిని తెలుగు సినిమా ప్రముఖులు ఖండించారు. తెలంగాణ టెలివిజన్ డెవలప్ మెంటు ఫోరం కూడా ఖండించింది.

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ లోని సన్నివేశం కొంతమంది మనోభావాలు నొప్పించినందువల్ల ఈ దాడి జరిగిందని అంటున్నారు. మనో భావాలు దెబ్బతిన్నపుడు దాన్ని ఖండించడానికి ప్రజాస్వామ్యబద్దంగా తెలియజేయడానికి భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనేక వేదికలు కల్పించింది. ఈ రకంగా భౌతికంగా కళాకారునిపై దాడి చేయడం మంచి పద్దతి కాదంటూ... పలువురు ఈ దాడిని ఖండించారు.


Click it and Unblock the Notifications











