ఆవిడతో పాటు తమ్ముడిపైనా కన్నేసిన వర్మ!
మంచు ఫ్యామిలీపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాగా ఇంట్రస్ట్ చూపుతున్నాడు. మంచు లక్ష్మికి తన రూపొందించిన 'దొంగల ముఠా' చిత్రంతో పాటు, తాజాగా బాలీవుడ్లో తీస్తున్న 'డిపార్ట్ మెుంట్' చిత్రంలో అవకాశం ఇచ్చిన వర్మ ఇప్పుడు ఆవిడ తమ్ము మనోజ్ పైనా కన్నేశాడు.
వివరాల్లోకి వెళితే...
రామ్ గోపాల్ వర్మ బ్రూస్లీని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి రాక ముందు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. అనేక సందర్భాల్లో వర్మ ఈ విషయం స్వయంగా చెప్పారు. మంచు మనోజ్ విషయానికొస్తే జాకీచాన్ ను ఆదర్శంగా తీసుకుని డూపు లేకుండా సొంతంగా స్టంట్స్ చేస్తున్నాడు. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ మూవీ తీసే ఆలోచన ఉందని వర్మ అప్పుడెప్పుడో ప్రకటించాడు కూడా. తాజాగా అందిన సమాచారం ప్రకారం తను తీయబోయే మార్షల్ ఆర్ట్స్ సినిమాలో మనోజ్ కు లీడ్ రోల్ ఇవ్వాలని వర్మ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఇక వీరి సినిమాల విషయానికొస్తే వర్మ 'డిపార్ట్ మెంట్' చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 18న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మనోజ్ నటించిన మిస్టర్ నూకయ్య చిత్రం ఈ రోజు విడుదలై యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











