బాలకృష్ణను డైరక్ట్ చేస్తున్న మంచు మనోజ్

By Srikanya

మంచు మనోజ్, బాలకృష్ణ ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'. ఈ చిత్రంకోసం స్టంట్స్ ని మంచు మనోజ్ సమకూరుస్తున్నారు. బాలకృష్ణ .. ప్రస్తుతం మనోజ్ డైరక్షన్ లో ఈ చిత్రం కోసం ఫైట్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ ఖరారు చేసారు. ఆయన మాట్లాడుతూ...బాలయ్యపై ఫైట్‌ని తను సమకూర్చడం ఎక్సయిట్‌మెంట్‌కి గురి చేసిందని చెప్పారు. నందమూరి బాలకృష్ణ, మనోజ్, దీక్షాసేథ్, పంచి బోరా కాంబినేషన్‌లో శేఖర్‌ రాజా దర్శకత్వంలో లక్ష్మీ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో మంచు లక్ష్మి ఒక ముఖ్య పాత్రను కూడా పోషిస్తున్నది.

ఈ చిత్రం గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ...కొంతమంది కథ చెబితే 'వూ..' కొట్టాలనిపిస్తుంది. ఇంకొకరు కథ మొదలుపెట్టగానే నిద్ర తన్నుకొంటూ వచ్చేస్తుంది. మేం మాత్రం ఉలిక్కిపడే కథ చెబుతాం..అన్నారు. అలాగే 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'చిత్రం పాటలను, ఫస్ట్ లుక్‌ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అందరికీ నచ్చుతాయనే నమ్మకం ఉంది అన్నారు. అలాగే...''ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్స్‌తో ఈ చిత్రం 90 శాతం పూర్తయ్యింది. మేలో ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

దర్శకుడు శేఖర్‌రాజా చెబుతూ ''ఇదో గమ్మత్త్తెన కథ. ఉలిక్కిపడేలా ఉంటుంది. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. చిత్రీకరణ తుది దశకు చేరింది. మే చివరి వారంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని''అన్నారు. ఇక ఈ చిత్రం కోసం ఇటీవల కేరళలోని పలు అందమైన లొకేషన్స్‌లో రెండు పాటలు చిత్రీకరించారు. డాన్స్‌మాస్టర్ బృందా ఆధ్వర్యంలో ఈ పాటల చిత్రీకరణ జరిగిందని మనోజ్ చెబుతూ -''కేరళలో వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. పాటలు కనువిందుగా ఉంటాయి'' అన్నారు.

ఇక 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'చిత్రం ఓ సోషియో పాంటసీ చిత్రం అని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా శేఖర్ రాజా అనే నూతన దర్సకుడు పరిచయమవుతున్నాడు. శేఖర్ రాజా గతంలో కృష్ణ వంశీ వద్ద పని చేసారు. ఈ చిత్రంపై మంచు మనోజ్ చాలా నమ్మకంగా ఉన్నారు. అంచనాలుకు తగినట్లే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు లక్ష్మి ప్రసన్న. కథ,కథనం కొత్తగా ఉంటాయని చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: బోబో శశి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X