ఆడపిల్లని అనుభవించడానికే.. అలాంటి మగాడు పుట్టడం ఎందుకు, ప్రేమోన్మాదిపై మంచు మనోజ్!

హీరో మంచు మనోజ్ మరో సంచలన సంఘటనపై స్పందించాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై మంచు మనోజ్ అభిమానులతో తన అభిప్రయాలని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ఓ ఘోర ఘటన గురించి మనోజ్ అందరిని ఆలోచింపజేసేలా తన అభిప్రాయాన్ని తెలియజేసాడు. ఇటీవల హైదరాబాద్ లో ఓ ప్రేమోన్మాది ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ ఈ ఘటన గురించి ఎలా స్పందించాడో ఇప్పుడు చూద్దాం!

 దారుణ ఘటన

దారుణ ఘటన

బర్కత్ పురలో కాలజికి వెళుతున్న మధులిక అనే ఇంటర్ విద్యార్థినిపై భరత్ అనే ప్రేమోన్మాది కొబ్బరి బొండం కత్తితో దాడి చేసిన తీవ్రంగా గాయపరచి సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ యువతీ ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉంది. మధులికకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. మధులిక తీవ్రంగా గాయపడడంతో ఆమె పరిస్థితిపై ఆందోళన నెలకొంది.

 మానవత్వం లేని మగాడు

మానవత్వం లేని మగాడు

ఈ ఘటనపై హీరో మంచు మనోజ్ అందరిని ఆలోచింప జేసేలా తన అభిప్రాయాన్ని తెలిపాడు. మానవత్వం లేని మగాడు పుట్టడం దేనికి అని ప్రశ్నించాడు. ఇలాంటి ఘటనలకు పాల్పడే ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తలుచుకుంటే ఎవ్వరూ ఇంత ఘోరానికి పాల్పడరు అని మంచు మనోజ్ తెలిపాడు. మంచు మనోజ్ ఎమోషనల్ గా పెట్టిన ఈ ట్విట్టర్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆడపిల్లని అనుభవించడానికేనా

మగాడు ఆడపిల్లల్ని రక్షించేవాడు కావాలి. కానీ ఆడపిల్లని అనుభవించి నరకానికి గురిచేస్తే అతడి పుట్టుకకు అర్థం లేదు అని మంచు మనోజ్ తెలిపాడు. మధులికపై దాడి చేసిన భరత్ ఫోటోలని మంచు మనోజ్ షేర్ చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళక ఫొటోని కూడా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం మధులిక ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.

ప్రేమించడం లేదని

ప్రేమించడం లేదని

తనని ప్రేమించడం లేదని మధులికపై పగ పెంచుకున్న భరత్ పథకం ప్రకారం ఆమెపై దాడికి తెగబడ్డట్లు తెలుస్తోంది. అతడి ప్లాన్ లో భాగంగానే భరత్ ముందుగా కొబ్బరి బొండం కత్తిని సిద్ధం చేసుకున్నట్లు పోలీస్ విచారణలో నిజాలు తెలుస్తున్నాయి. మధులిక ఒంటిపై 14 చోట్ల గాయాలైనట్లు వైద్యులు చెబుతున్నారు. మరి కొంత సమయం గడిస్తే కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటో చెప్పలేని పరిస్థితి అని డాక్టర్లు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X