విద్యార్థులపై హీరో మంచు మనోజ్ అతని అనుచరులు దాడి..?
నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద హీరో మంచు మనోజ్, అతని సహచరులు విద్యార్థులపై దాడి చేశారు. ఫిల్మ్ సిటీ ముందు నిల్చున్న ఓ విద్యార్థినిని వేగంగా వచ్చిన మంచు మనోజ్ వాహనం ఢీ కొట్టింది. దీంతో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
కొప్రోదిక్తులైన విద్యార్థులు హీరో మనోజ్ ను ప్రశ్నిస్తుండగా, మరి కొందరు విద్యార్థులు ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రికరిస్తున్నారు. దీనిని చూసిన మంచు మనోజ్, అతని అనుచరులు విద్యార్థులపై దాడి చేశారు. దాడికి నిరసనగా విద్యార్థులు రామోజీ ఫిల్మ్ సిటీ ఎదుట ఆందోళనకు దిగారు.
ప్రస్తుతం మంచు మనోజ్, అనిల్ కృష్ణ దర్శకత్వంలో 'మిస్టర్ నోకియా' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. డిఎస్ రావ్ నిర్మాణంలో రూపొందుతున్న మిస్టర్ నోకియా రిస్కీ యాక్షన్ సీన్స్ ని రామోజీ ఫిల్మిం సిటీ రైల్వే స్టేషన్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం కృతి కర్బంద, సనాఖాన్ హీరోయిన్ గా నటిస్తున్నారు..


Click it and Unblock the Notifications











