౩౦ కార్లు.. 3 గంటలు బంధించారంటూ మనోజ్ ఫైర్.. మళ్లీ గొడవతో వార్నింగ్

మంచు కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మంచు విష్ణు పై మంచి మోహన్ బాబు ఆ మధ్య కేసు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. దాంతో మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటికి వెళ్లి మరి నిలదీశారు. ఆయన కూడా మోహన్ బాబు పై ఫిర్యాదు చేశారు. మంచి ఫ్యామిలీలో అంతర్గత ఘర్షణలు ప్రస్తుతం బయటకు పోయాయి. కొద్దిరోజులుగా బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కనిపిస్తున్నారు. ఇటీవల సద్దుమణిగిందనుకున్న గొడవ మళ్ళీ తెరపైకి వచ్చింది.

కొద్ది రోజులు ఇరువురు సైలెంట్ గానే కనిపించినప్పటికీ మళ్లీ వివాదం రాజుకున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా మంచు విష్ణు పై తమ్ముడు మంచు మనోజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన అన్నపై దొంగతనం ఆరోపణతో కేసు నమోదు చేయించారు. తన ఇంట్లో లేని సమయంలో, పైగా తన కూతురు పుట్టిన రోజునే తన ఇంటిపై మంచు విష్ణు అనుచరులు దాడి చేశారని తాజాగా మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మోహన్ బాబు ఇంటి ముందుకు వెళ్లి ధర్నా కూడా చేశారు. అప్పటికే అక్కడికి పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

Manchu Manoj fire on Manchu Mohan Babu

అయితే ధర్నా అనంతరం మంచు మనోజ్ మీడియా తో మాట్లాడారు. మళ్లీ గొడవలకు కారణాలు ఏంటో పూర్తిగా వివరించారు. తన వెర్షన్లో జరిగిన విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడుతూ... తనపై మంచు విష్ణు తన అనుచరులతో దాడి చేయించారని మీడియా ముందు చెప్పారు. ఏప్రిల్ 1న తెల్లవారుజామున 5 ప్రాంతంలో తన విల్లాపై 30 కార్లతో మనుషులను పంపించాడని ఆరోపించాడు. తన వద్ద సీసీటీవీ ఫుటేజీలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు ఆధారాలతో నిరూపిస్తానని చెప్పుకొచ్చాడు.

తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా జైపూర్ కు వెళ్లిన వెంటనే తన ఇంటి పై దాడి చేశాడని, ఇబ్బంది పెట్టడని ఆవేదన వ్యక్తం చేశారు. వారు చేస్తున్న తప్పులు అన్నింటికీ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లు తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక తను ఆస్తి అడిగినట్లుగా ఏం ఆధారం ఉందో చూపించాలని, వీలైతే తను తప్పు చేసినట్టుగా ఒక్క ఆధారం చూపించిన కాళ్ళు మొక్కి క్షమాపణలను కోరుతానని మంచు మనోజ్ సవాల్ చేశారు. వాళ్లు సిసిటీవీ ఫొటోస్ ఇస్తే గుండు కొట్టించుకొని వీధులన్నీ తిరుగుతానని ఘాటుగా స్పందించారు.

అలాగే కమిషనర్ గారి బైండోవర్ను క్రాస్ చేశారని, జనరేటర్ లో షుగర్ పోయడం, మా ఇంటికి వచ్చే వాటర్ లైన్ ను కట్ చేయడం, కరెంటు తీయించడం ఇలా అన్ని విషయాల్లో తప్పులు చేస్తూనే ఉన్నారని మండిపడ్డాడు. వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని మీడియా ముందు వెల్లడించారు. ఏప్రిల్ 1న 30, 40 కార్లతో తన ఇంటి పైకి వచ్చి దాడి చేశారని, సెక్యూరిటీని బండ బూతులు తిట్టారని చెప్పారు. ఇంట్లోనే వస్తువులన్నింటిని ధ్వంసం చేశారని, తన కారును, భార్య కారును ఇంట్లో నుంచి దొంగలించారని చెప్పారు. తను లేని సమయంలో సిబ్బందిని, ఇంట్లో ఉన్న తన అనుచరులను 3 గంటల పాటు బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పదే పదే ఇలా దాడులు చేయడం బాధాకరంగా ఉందని చెప్పారు. దీంతో మరోసారి మంచు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X