కెఏ పాల్‌పై మంచు మనోజ్ సెటైర్లు.. ఎంత ప్రాక్టీస్ చేసినా నా వల్ల కావడం లేదు!
ప్రస్తుతం తెలుగు మీడియా ఛానల్స్ లో ప్రపంచ శాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ హల్ చల్ చేస్తున్నారు. దేశరాజకీయాలపై, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై పాల్ సంచలన వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. కేఏ పాల్ వ్యాఖ్యలని నెటిజన్లు సరదాగా తీసుకుంటుండడంతో వివిధ రకాల మీమ్స్ తో ట్రెండ్ చేస్తన్నారు. ఇక వివాదాస్పద దర్శకుడు వర్మ, కేఏ పాల్ మధ్య సరదా వార్ కూడా జరుగుతోంది. ఇటీవల పాల్ ఓ మీడియా ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియోని వర్మ ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోపై మంచు మనోజ్ కూడా స్పందించాడు.

పాట పాడిన పాల్
ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలోకేఏ పాల్ పాట పాడారు. ' నేను మీ ఊర్లన్నీ వస్తాను.. నెక్స్ట్ వీక్ ఒంగోలు, గుంటూరు వస్తాను.. అంటూ పాటపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. దర్శకుడు వర్మ ఈ వీడియోని లాఫింగ్ ఎమోజిలతో ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
ఎంత ట్రై చేసినా
వర్మ ట్వీట్ పై మంచు మనోజ్ స్పందించాడు. ఇది ఎపిక్ వీడియో సర్. ఈ పాట పాడడానికి చాలా ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ కేఏ పాల్ లాగా మాత్రం పడలేకపోతున్నా అంటూ మనోజ్ సెటైర్లు వేశాడు. మనోజ్ ట్వీట్ పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. అన్నా ఎలాగైనా మీరు ఈపాట పడాల్సిందే అంతో కామెంట్స్ పెడుతున్నారు.

కాళ్ళు పట్టుకున్నాడు
వర్మ ఓ సందర్భంలో నా కళ్ళు పట్టుకున్నాడు అంటూ కేఏ పాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దీనిపై వర్మ సరదాగా స్పందించాడు. కేఏ పాల్ కాళ్ళు పట్టుకున్న మాట వాస్తవమే. కాళ్ళు పట్టుకుని కిందకు పడేద్దామని అనుకున్నా. అలాగైనా అతడి బుర్ర బాగా సెట్ అవుతుందని అనుకున్నా. కానీ కిందకు పడేస్తే ఆయనకున్న అద్భుతమైన శక్తుల వలన తాను ఏమైపోతానో అనే భయంతో కిందపడేయలేదని వర్మ సరదగా స్పందించాడు.

ఆయన చెప్పేవి నిజాలే
తనవలనే ట్రంప్ గెలిచాడు అంటూ పాల్ కొన్ని విచిత్రమైన కామెంట్స్ చేస్తుంటారు. అవన్నీ నిజాలే. కానీ ఆ సంఘటనలు కేఏ పాల్ కలలో జరిగి ఉంటాయి. అదే నిజం అనుకుని అయన మీడియా ముందు చెబుతుంటారు అని వర్మ ఎద్దేవా చేశారు. తాను చేసే కామెంట్స్ ఫన్నీగా ఉన్నాయని తెలిసినా.. తనని ఫాలో అయ్యేవాళ్ళు నమ్మితే చాలని పాల్ అనుకుంటున్నారేమో అంటూ వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











