హీరో మంచు మనోజ్‌కి ముందస్తు బెయిల్
మోహన్ బాబు తనయుడు, హీరో మంచు మనోజ్ కి ముందస్తు బెయిల్ లభించింది. కొన్ని రోజుల క్రితం ఒక పార్టీలో మనోజ్ కి కోలీవుడ్ నటుడు మహత్ రాఘవేంద్రకి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో మనోజ్ తన స్నేహితులతో కలిసి అకారణంగా దాడి చేసి కొట్టారని మహత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై చెన్నైలోని రాయపేట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దీంతో మనోజ్ ముందస్తు బెయిల్ కోసం కోర్ట్ కి వెళ్ళారు. ఈ సంఘటనలో కేవలం ఇరువరి మధ్యా వాగ్వాదం మాత్రమే జరిగిందని మనోజ్ తరుపు న్యాయవాది నటరాజన్ కోర్ట్ కి విన్నవించారు. దీంతో చెన్నై హై కోర్ట్ మనోజ్ కి బెయిల్ మంజూరు చేసింది.
కాగా మరో వైపు మనోజ్, మహత్ మధ్య రాజీకుదిరినట్లు తెలుస్తోంది. 'చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్లనే తమ మధ్య గొడవ జరిగింది. మేము చాలా కాలంగా మంచి స్నేహితులం. ఇకపై మా స్నేహం కొనసాగుతుంది. నాకు సపోర్టుగా నిలిచిన మీడియా వారికి ధన్య వాదాలు' అంటూ మహత్ మీడియాతో అన్నట్లు చెన్నయ్ టాక్.
హీరోయిన్ తాప్సీపై మనోజ్ మనసు పడ్డాడని, అతని కోసమే వీరి మధ్య గొడవ జరిగిందని తమిళ మీడియాలో వినిపించినా...తాప్సీ వివరణ ఇవ్వడంతో అందరి అనుమానాలు తీరి పోయాయి. మోహన్‌బాబు అంకుల్ నన్ను కూతురిలా చూసుకుంటే, లక్ష్మి, విష్ణు, మనోజ్ చెల్లెలిగా ఆదరిస్తారు అని తాప్సీ స్పష్టం చేసిన విషయాన్ని గతంలోనే పాఠకుల దృష్టికి తీసుకొచ్చాం.


Click it and Unblock the Notifications











