మనోజ్ గెటప్ చూసి ఉలిక్కిపడుతున్నారు

By Srikanya

మనోజ్ తాజా చిత్రం 'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా'. ఈ సినిమాలో మనోజ్ పాత్ర వైవిధ్యంగానే ఉంటుందని గెటప్‌ కూడా విభిన్నంగా ఉందని చెప్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తన కెరీర్‌లోనే గొప్ప సినిమా అవుతుందని మనోజ్ చెప్తున్నారు. మనోజ్ పుట్టిన రోజు సంధర్బంగా ఈ చిత్రానికి సంభందించి కొత్త స్టిల్స్ ని విడుదల చేసారు.

ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ ఆత్మగా కనపడతారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. చంద్రముఖి తరహా భవంతిలోకి హీరో మనోజ్ ప్రవేశించాక కథ మొదలవుతుందని,అక్కడ బాలకృష్ణ ఆత్మ కలుస్తుందని చెప్పుకుంటున్నారు. హర్రర్,కామెడీ కలగలిసే ఈ సన్నివేశాల్లో బాలకృష్ణ ప్లాష్ బ్యాక్ విన్న హీరో ఆయన ఆశయం తీర్చటం కథ అంటున్నారు. ఈ చిత్రాన్ని కృష్ణ వంశీ శిష్యుడు శేఖర్ రాజా రూపొందిస్తున్నారు.

ఇక ఈ చిత్రం కోసం ఆరున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ భవతి సెట్ వేసారు. ఆ భవంతి పేరు గంధర్వ మహల్. కధలో ఎక్కవ భాగం అక్కడే జరుగుతుంది. ఈ చిత్రంపై నిర్మాత మంచు లక్ష్మికి చాలా నమ్మకం ఉంది. అందుకే విపరీతంగా ఖర్చుపెడుతున్నారని చెప్తున్నార. హైదరాబాద్ ..పుప్పాల గూడాలో ఈ సెట్ ని చూసిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆశ్చర్యపోయారు.

బాలకృష్ణ సైతం ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ...'శ్రీరామరాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ వరం' అని అన్నారు. ఇందులోని పాత్రలకు, గంధర్య మహల్‌ సెట్‌కు వున్న సంబంధమేంటో సినిమా చూశాకే తెలుస్తుందని, జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని లక్ష్మీ ప్రసన్న తెలిపింది. రీసెంట్ గనే ఈ చిత్రం లోగో ఆవిష్కరణ ఘనంగా జరిగింది.

దాసరి మాట్లాడుతూ...'ఇదొక అద్భుతం. మోహన్‌బాబు అయితే ఇంత ఖర్చు చేసేవాడు కాదు. ఈ సెట్‌ కోసం చెక్‌పై సంతకం చేసినప్పుడల్లా ఉలిక్కిపడి ఉంటాడు. రేపు ఈ సినిమా సాధించే విజయాన్ని చూసి ఇంకా ఉలిక్కిపడతాడు. ఓ బ్రహ్మాండమైన సినిమా అవుతుంది. బాలయ్య పాత్రను, అభినయాన్ని సంచలనం సృష్టిస్తుంది' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X