TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
మంచు మనోజ్ ఒక కులపిచ్చి ఇడియట్.. ఎలా నోరు మూయించాడో తెలుసా!
మంచువారబ్బాయి మనోజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలతో పాటు.. అనేక సామజిక, రాజకీయ అంశాలపై మంచు మనోజ్ తన అభిప్రాయాలని ప్రజలతో పంచుకుంటుంటాడు. ఒక్కడు మిగిలాడు చిత్రం తర్వాత గ్యాప్ తీసుకున్న మనోజ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చేరువగా ఉంటున్నాడు. తాజాగా తనని దూషించిన ఓ నెటిజన్ మనోజ్ అదిరిపోయే రిప్లయ్ ఇచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కులపిచ్చి ఇడియట్
మంచు మనోజ్ సోషల్ మీడియాలో రాజకీయఅంశాలని కూడా ప్రస్తావనకు తెస్తున్నాడు. ఓ నెటిజన్ మనోజ్ ని ఉద్దేశిస్తూ.. నువ్వు ఒక కులపిచ్చి ఇడియట్ వి.. ముందు కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేసిన చంద్రబాబుని ప్రశ్నించు. అందుకు దధైర్యం లేదా అని దూషించాడు. దీనికి మనోజ్ తన సన్నాహాన్ని కోల్పోకుండా కూల్ గా రిప్లయ్ ఇచ్చి సదరు వ్యక్తి నోరు మూయించాడు.
|
పేరు చివర కులం
మనోజ్ ని దూషించిన వ్యక్తి పేరు చివర ఓ సామజిక వర్గం పేరు ఉంది. మనోజ్ అతడికి సమాధానం ఇస్తూ.. పేరు చివర కులాన్ని నువ్వు పెట్టుకున్నావా లేక నేను పెట్టుకున్నానా.. మరి క్యాస్ట్ ఇడియట్ ఎవరు అన్నా అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఐ యాం నిలదీసిఫైయింగ్ యూ అంటూ సరదాగా బదులిచ్చాడు. కూల్ బ్రదర్.. లవ్ యూ అని ముగించాడు.
మోడీపై ఘాటుగా
కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో మనోజ్ ప్రధాని నరేంద్ర మోడీని ఘాటుగా ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. బహుశా దానికి కౌంటర్ గా సదరు నెటిజన్ మనోజ్ పై ప్రశ్నలు కురిపించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు శ్రీవేంకటేశ్వరుడి సన్నిధిలో విభజన హామీల నెరవేరుస్తానని మాట ఇచ్చారు. నిలుపుకొండి. లేకుంటే దేవుడి ఆగ్రహానికి గురవుతారు అంటూ మనోజ్ మోడీని ప్రశ్నించాడు.
మరోమారు
కాగా ప్రధాని మోడీ ఆదివారం రోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి గుంటూరు సభలో పాల్గొన్నారు. మోడీ సభని ఉద్దేశిస్తూ కూడా మనోజ్ వ్యాఖ్యలు చేశాడు. సర్ జీ మీ పర్యటన ఎన్నికల ప్రచారం కోసమా లేక తెలుగు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకా అని మనోజ్ మోడీని ప్రశ్నించాడు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే వస్తున్నావని అనుకుంటున్నా అని మనోజ్ ట్వీట్ చేశాడు.