For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'పీకే' డౌన్ లోడ్ లింక్ ని ఇచ్చిన మంచు హీరో

  By Srikanya
  |

  హైదరాబాద్ :'నేను ఆస్ట్రోనాట్‌ను...' అంటూ ఓసారి... దేవుళ్లను రక్షణగా పెట్టుకున్నాను అంటూ మరోసారి... చిత్రవిచిత్రమైన డ్రెస్సులతో ఇంకోసారి... ఇవన్నీ 'పీకే' మీద అంచనాలను రెట్టింపు చేస్తూ మొన్న శుక్రవారం వచ్చేసాడు. డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ లో ఎక్కడా రాజీ పడకుండా భాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే ఈ చిత్రాన్ని తొలిరోజే పైరసీ భూతం ఆవహించేసింది. ఈ చిత్రం ఇంటర్నెంట్ టోరెంట్ సైట్లలో ప్రత్యక్షమైంది.

  https://www.facebook.com/TeluguFilmibeat

  దాంతో భాధపడ్డ మంచు మనోజ్ ఈ చిత్రం డౌన్ లోడ్ లింక్ ని ఇచ్చి..వారిని ఎలర్ట్ చేసే ప్రయత్నం చేసారు. ఆయన పీకే చిత్రం ఇంటర్నెట్ డౌన్ లోడ్ లింక్ ను తన ఫేస్ బుక్ ఎక్కౌంట్ లో పెట్టారు. మొదట ఇది అందరినీ ఆశ్చర్యపరిచినా తర్వాత అర్దం చేసుకున్నారు. ఈ లోగా ఆ లింక్ లో సినిమాని తొలిగించారు. అది పెట్టిన వాళ్ళు.

  చిత్రం విషయానికి వస్తే... ఈ సినిమాకుదర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ. విధువినోద్‌ చోప్రా నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క శర్మ హీరోయిన్. ఇందులో అనుష్క జగత్‌ జనని అనే పాత్రికేయురాలిగా కనిపించింది. సంజయ్‌దత్‌, సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.

  Manchu Manoj giving PK full movie download link

  కథ ఏంటి...

  అమీర్ ఖాన్ ఆసక్తికర ఎంట్రీతో సినిమా మొదలవుతుంది. సినిమాలో సెకండ్ ఎంట్రీ ఇచ్చేది జగత్ జనని అలియాస్ జగ్గా(అనుష్క శర్మ). బెల్జియంలో ఆమె ఒక ఇండియన్ జర్నలిసమ్ స్టూడెంట్. పాకిస్థాన్ బాయ్ సర్ఫరాజ్(సుశాంత్ సింగ్ రాజ్ పుత్)తో ప్రేమలో పడుతుంది. వీరి మతాంతర ప్రేమను ఆమె తల్లిదండ్రులు నిరాకరిస్తారు. దీంతో నిరాశకు గురైన ఆమె ఇండియా వచ్చి ఓ న్యూస్ ఛానల్ కోసం పని చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె విచిత్రమైన వ్యక్తి ‘పికె' తారస పడతాడు. అతని గురించి తెలుసుకునే క్రమంలో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఇంతకీ పికె ఎవరు? అతను చేసాడు? అనేది తెరపై చూడాల్సిందే.

  కలెక్షన్స్...

  ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ.50 కోట్లు వసూలు చేసింది. అమీర్‌ఖాన్ విలక్షణ నటన, సినిమా రివ్యూలపై పాజిటివ్ టాక్ రావడంతో విడుదలైన మొదటి రోజే హిట్ టాక్‌ను స్వంతం చేసుకుంది. దీంతో సినిమా కలెక్షన్లు అమాంతం రూ.50 కోట్లకు చేరాయి. తాజా కలెక్షన్లను బట్టి పీకే మూవీ రూ.300 కోట్ల మార్కును చేరుకునే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

  దర్శకుడు 2 గంటల 33 నిమాషాల పాటు ఫన్నీగా, డిఫరెంటు కాన్సెప్టుతో సోషల్ మెసేజ్ జోడిస్తూ సినిమా సాగింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన శంతను మిత్రా, అజయ్ -అతుల్, అంకిత్ తివారీ, రామ్ సంపత్ మంచి పని తీరు కనబరిచారు. వారి మ్యూజిక్ స్టోరీలైన్ తో పర్ ఫెక్టుగా సింక్ అయ్యాయి. అభిజిత్ జోషి, రాజ్ కుమార్ హిరానీ రాసిన డైలాగులు ఫన్నీగా ఉండటంతో పాటు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే విధంగా ఉన్నాయి. స్టోరీ నేరేషన్ కూడా బావుంది. ఓవరాల్ గా చెప్పాలంటే పికె పైసా వసూల్ మూవీ. ప్రేక్షకులను సంతృప్తి పరిచే మూవీ.

  English summary
  Manchu Manoj has posted the PK movie download link on his Facebook account. "PK full movie HD download link PK full movie HD download link : But don't encourage piracy"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X