Manchu Manoj: చంద్రబాబుతో మంచు మనోజ్ సమావేశం.. టీడీపీలోకి చేరిక?
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్ (Manchu Manoj). సీనియర్ ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నాదేశం, అడవిలో అన్న, ఖైదీగారు వంటి సినిమాల్లో అలరించాడు. చాలా కాలం తర్వాత హీరోగా దొంగ దొంగది సినిమాతో డెబ్యూ చేసి తర్వాత అనేక హిట్ సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్న అతను భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ సినిమాలతో బిజీ అవుతాడనుకున్న మంచు మనోజ్ తాజాగా చంద్రబాబు నాయుడుతో సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది.
సినిమాలకు చాలా కాలం గ్యాప్ ఇచ్చిన మంచు మనోజ్ ఇటీవలే రెండోసారి ఓ ఇంటివాడు అయ్యాడు. భూమా నాగ మౌనికను వివాహం చేసుకున్న మంచు మనోజ్ ఇటీవలే ఓ సినిమాను కడా అనౌన్స్ చేశాడు. మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా వాటి 'ది ఫిష్' (What The Fish Movie) మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇలాగే సినిమాలతో మళ్లీ అభిమానులను అలరిస్తాడనుకున్న మంచు మనోజ్ షాక్ ఇచ్చేలా తెలుస్తోంది.

తెలుగు దేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) ఇవాళ మంచు మనోజ్ కలవనున్నట్లు సమాచారం. భార్య మౌనికతో పాటు చంద్రబాబుతో భేటి కానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మంచు మనోజ్ రాజకీయాల్లో, అందులోనూ టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం ఒక్కసారిగా జోరందుకుంది. చంద్రబాబుతో భేటి తర్వాతనే అసలు విషయాలు ఏంటి అనేది స్పష్టత రానుంది. ఇక మంచు మనోజ్ దేనికి సమావేశం అయ్యారనే పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఇదిలా ఉంటే మంచు మనోజ్ భార్య మౌనిక.. దివంగత టీడీపీ లీడర్ భూమా నాగిరెడ్డి కుమార్తె. మౌనికి సోదరి భూమా అఖిల ప్రియ కూడా ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలోనే ఉన్నారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఇక మరోవైపు మనోజ్ తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీకి మద్ధతుదారుడుగా ఉన్నారు. ఆయన మంచు మనోజ్ అన్న విష్ణు భార్య విరానికా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు. ఇన్ని కారణాల నేపథ్యంలో చంద్రబాబుతో మంచు మనోజ్ సమావేశం ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలో, అటు రాజకీయపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.


Click it and Unblock the Notifications











