కన్నడ రీమేక్ లో మంచు మనోజ్
మంచు మనోజ్ చిత్రం గురించి చెప్తూ.. అటు పొగడ్తకి, ఇటు తెగడ్తకి రెండింటికీ సరిపోయే పదం 'పోటుగాడు'. నా శారీరకభాషకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. టైటిల్‌కి తగ్గట్టే ఇందులో తన పాత్ర కూడా ఉంటుందని మనోజ్ అంటున్నారు. ఈ చిత్రంలో మనోజ్ సరసన నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సాక్షి చౌదరి, సిమ్రాన్ ముండి, నథాలియా కౌర్‌లతోపాటు మరో హీరోయిన్ కు చోటుంది. ఇటీవల కర్ణాటకలోని బీజాపూర్‌లో కీలక సన్నివేశాలతోపాటు ఓ పాటను తెరకెక్కించారు.
నిర్మాతలు మాట్లాడుతూ... ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. 'పోటుగాడు'గా మనోజ్ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తారు. కథ, కథనాలు సాగే విధానంలో వైవిధ్యం ఉంటుంది. బీజాపూర్‌లో పేరొందిన గోల్ గుంబస్, ఇబ్రహీం రోజా ప్రాంతాల్లో చిత్రీకరించిన పాట సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
అలాగే... ఈ సినిమాకి హాలీవుడ్‌కి చెందిన ఫైట్ మాస్టర్లు పని చేయబోతున్నారు. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. యూరప్‌లో కొన్ని పాటల్ని తెరకెక్కిస్తాము అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్, సంగీతం: చక్రి, మాటలు: శ్రీధర్ సీపాన.


Click it and Unblock the Notifications












