twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగులో గాయపడ్డ మంచు మనోజ్

    By Bojja Kumar
    |

    హీరో మంచు మనోజ్ గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో 'ఊకొడతారా ఉలిక్కి పడతారా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి తానే స్వయంగా స్టంట్స్ కంపోజ్ చేస్తున్న మనోజ్ షూటింగులో స్టంట్స్ చేస్తుండగా గాయపడ్డాడు. ఈ ఘటనలో మనోజ్ కండరాలకు, ముక్కుకు తీవ్రమైన గాయాలయ్యాయి.

    ఈ చిత్రాన్ని మంచు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మంచు లక్ష్మీప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నారు. శేఖర్ రాజా దర్శకుడు. దీక్షాసేథ్, పంచిబొరా కథానాయికలు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీప్రసన్న ముఖ్య పాత్రను పోషిస్తోంది.

    బాలకృష్ణ పాత్ర సినిమాకు ప్రత్యేకాకర్షణగా వుంటుంది. షూటింగు దాదాపుగా పూర్తయిపోయింది. 'మిస్టర్ నూకయ్య'లోని ఫైట్స్‌ని తనే సమకూర్చుకున్న మనోజ్ ఊ కొడతారా ఉలిక్కిపడతారా లోని బాలయ్య ఇంట్రడక్షన్ ఫైట్‌కి మనోజ్ స్టంట్ డెరైక్టర్‌గా వ్యవహరించారు.

    తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ జమిందార్ నరసింహ రాయుడుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో మనోజ్ సరసన దీక్షా సేథ్ నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రూ. 6.5 కోట్లతో గాంధర్వ మహల్ సెట్టింగ్ వేయడం ఇప్పుడు పరిశ్రమ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది. లక్ష్మి అంత ఖర్చు పెట్టి సెట్ వేసి సాహసం చేస్తుండటం చర్చనీయాంశం అయింది. అయితే బాలయ్య క్యారెక్టర్ గురించే ఆ సెట్ వేశారట. ఇందులో ఆయన జమిందార్ పాత్రలో కనిపించబోతున్నారు. బాలయ్య కు ఉన్న ఫాలోయింగ్‌తో సినిమా హిట్ అవుతుందనే నమ్మకంలో ఉన్నారంతా.

    English summary
    Manchu Mano is busy in doing fighting episodes for his upcoming movie 'Uu Kodathara Ulikki Padathara'. Manoj has burnt his bicep and his nose was broken when he was shooting for an action sequence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X