ఫైర్ యాక్సిడెంట్: షూటింగులో గాయపడ్డ మంచు మనోజ్
హైదరాబాద్: హీరో మంచు మనోజ్ ప్రస్తుతం 'కరెంటు తీగ' షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫైట్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. అయితే ప్రమాద వశాత్తు మనోజ్ శరీరానికి మంటలు అంటుకోవడంతో మనోజ్ గాయపడ్డట్లు సమాచారం. అయితే యూనిట్ సభ్యులు వెంటనే స్పందించి నీళ్లు చల్లడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
సినిమాల్లో ప్రమాదకర సన్నివేశాలను రిస్క్ తీసుకుని తానే సొంతగా చేయడం మనోజ్‌కు ముందు నుండీ అలవాటు. గతంలోనూ షూటింగ్ సమయంలో మనోజ్ గాయపడ్డాడు. తాజాగా మరోసారి అలాంటి సంఘటనే జరిగింది. మనోజ్‌కు మరీ ఇంత తెగింపు పనికి రాదని పలువురు సూచిస్తున్నారు.

కరెంటు తీగ చిత్రానికి ఈచిత్రానికి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మంచు విష్ణు నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. పోర్న్ స్టార్ సన్నిలియోన్ ఇందులో టీచర్ గా కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం సన్నిలియోన్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది.
అవుటండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు తీర్చి దిద్దుతున్నాడు.మంచు మనోజ్ క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా డిజైన్ చేస్తున్నారట.శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్నఈ సినిమా ఆడియో విడుదల ఆగస్టు మొదటివారంలో చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.


Click it and Unblock the Notifications











