మంచు మనోజ్‌కు గాయాలు, ప్రమాదాన్ని లెక్కచేయని హీరో
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, హీరో మంచు మనోజ్ కుమార్ తన చిత్ర షూటింగ్ సమయంలో బుధవారం గాయపడ్డారు. మంచు మనోజ్ కుమార్ హీరోగా మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కోసం కొన్ని సన్నివేశాలను బ్యాంకాక్‌లో చిత్రీకరిస్తున్నారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో చిన్న ప్రమాదం జరిగింది. దీంతో హీరో మంచు మనోజ్ కుమార్‌కు స్వల్పగాయాలయ్యాయి.
దీంతో మనోజ్‌కు అక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. అయితే ప్రమాదం మంచు మనోజ్ కుమార్ షూటింగ్‌ను ఆపి వేయకుండా షూటింగ్ కొనసాగించడం విశేషం. గాయాలు లెక్క చేయకుండా మనోజ్ షూటింగులో పాల్గొనటం చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యపరిచిందంట. కాగా మనోజ్‌కు ఏమీ కాలేదని ఆయన సురక్షితంగానే ఉన్నారని చిత్ర నిర్మాత డిఎస్ రావు చెప్పారు. మనోజ్ దెబ్బలను లెక్క చేయకుండా షూటింగులో పాల్గొంటున్నారని చెప్పారు.


Click it and Unblock the Notifications











