ఆ పరిస్థితే వస్తే కులం, మతం ఉండదు.. బతికేందుకు పరుగెత్తాల్సిందే.. మనోజ్ (ఇంటర్వ్యూ)

By Rajababu

డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సినీరంగంలోకి ప్రవేశించిన మంచు మనోజ్ ఎప్పుడూ విభిన్నమైన పాత్రల కోసం పరితపిస్తుంటాడు. మనోజ్ నటించిన చిత్రాలు ఆయన నటనా ప్రతిభకు అద్దంపడుతాయి. కమర్షియల్ హీరోగానే కాకుండా డిఫరెంట్ రోల్స్‌ను పోషించడానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటాడు. ఆ క్రమంలోనే మనోజ్ చేసిన చిత్రం ఒక్కడు మిగిలాడు. ఈ చిత్రంలో ఓ వర్గానికి నాయకుడి పాత్రను, స్టూడెంట్ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక్కడు మిగిలాడు చిత్రం నవంబర్ 10న రిలీజ్‌కు సిద్ధమవుతున్న సందర్భంగా మంచి మనోజ్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. మనోజ్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

Recommended Video

Okkadu Migiladu trailer
 హార్ట్ టచింగ్ మూవీ

హార్ట్ టచింగ్ మూవీ

ఒక్కడు మిగిలాడు చిత్రం నా హృదయానికి అత్తుకొన్న సినిమా. దర్శకుడు అజయ్ అండ్రూస్, మాటల రచయిత గోపి మోహన్ కథ చెప్పినప్పుడు భావోద్వేగానికి గురయ్యాను. కమర్షియల్ సినిమా కాదు. కానీ ఈ చిత్రం అని సినిమాల మాదిరిగా కాకుండా ఓ బాధ్యతగా ఫీలయ్యాను.

 దేవుడిలా పూజించే వ్యక్తి స్టోరి

దేవుడిలా పూజించే వ్యక్తి స్టోరి

ఎంతో మంది తల్లిదండ్రుల కష్టం. పడిన వేదన. ఎంతో మంది చేసిన పోరాటాలతో కూడిన కథ ఇది. ఓ వర్గం దేవుడిలా పూజించే ఓ వ్యక్తి క్యారెక్టర్‌ను పోషించాను. అలాంటి కథను తెరకెక్కించే ముందు చాలా జాగ్రత్తగా చేయాలని అనుకొన్నాం. చాలా పరిశోధన చేశాం. దర్శకుడు అజయ్ నాకు స్ఫూర్తిని కలిగించిన తీరుకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి.

 దర్శకుడు అజయ్ ఈ కథను

దర్శకుడు అజయ్ ఈ కథను

దర్శకుడు అజయ్ ఈ కథను చాలా ప్లాన్డ్‌గా తెరకెక్కించారు. తొలిభాగంలో 2017లో కథ మొదలై.. ప్రస్తుతం ఎదురైన కష్టాలు, బాధలతో సినిమా 1990 సంవత్సరానికి వెళ్తుంది. ఇంటర్వెల్ సమయానికి వార్ సీక్వెన్స్ ఉంటాయి.

సెకండాఫ్ ఇంటెన్సిటివ్‌గా

సెకండాఫ్ ఇంటెన్సిటివ్‌గా

సెకండాఫ్‌లో శ్రీలంక నుంచి భారతదేశానికి సముద్రం మీదుగా ఓ పడవలో చేరుకోవాలనే ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంటుంది. సెకండాఫ్ హై ఇంటెన్సిటీ ఉంటుంది. యుద్ధ పోరాటాలు చాలా హార్ట్ టచింగ్‌గా ఉంటుంది.

 వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం

వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం

ఒక్కడు మిగిలాడు చిత్రం షూటింగ్ ప్రభావం నా వ్యక్తిగత జీవితంపై కూడా పడింది. నిద్రలో కూడా యుద్ధం చేసినట్టు కల వచ్చింది. చైనా, ఎన్నో దేశాల్లో యుద్దం చేసినట్టు కలలు వెంటాడేవి.

 కమర్షియల్ విషయాలపై..

కమర్షియల్ విషయాలపై..

ఒక్కడు మిగిలాడు సినిమా చేయడానికి ప్రధాన కారణం.. నేను ఎప్పుడు కమర్షియల్ విషయాలను పట్టించుకొను. కథనే నేను నమ్ముతాను. పాత్ర బాగా ఉండాలి. నేను చేసిన సినిమాలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కమర్షియల్ సినిమాలు రెండు మూడు సినిమాలు ఉంటాయనుకుంటా. ఇలాంటి సినిమాలు నా ముందుకు వచ్చినప్పుడు చేయకపోతే నటుడిగా అర్థం ఉండదు.

 శత్రుదేశాలు బాంబు వేస్తే..

శత్రుదేశాలు బాంబు వేస్తే..

ఒక్కడు మిగిలాడు సినిమా వాస్తవ కథ. గతంలో జరిగిన యుద్ధం మళ్లీ మన వద్దకు రావొద్దు. పాకిస్థాన్, చైనా యుద్ధానికి వస్తున్నారంటే భయపడిపోతున్నాం. శత్రుదేశాలు రెండు బాంబులు వేశారంటే అప్పుడు కులం, మతం, పెద్ద, గొప్ప ఎలాంటి ఏ పట్టింపులు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో పెట్టా, బేడా, సామాన్లు సర్ధుకొని బతికితే చాలు అని పరుగులు పెడ్తాం. పడవ దొరికిందా? లేక ఇంకా ఏమైనా ఉందా అని ఆలోచిస్తాం.

 రియల్ హీరో అజయ్

రియల్ హీరో అజయ్

ఒక్కడు మిగిలాడు సినిమాకు అసలైన హీరో దర్శకుడు అజయ్ అండ్రూస్. కేవలం ఈ సినిమాకు నేను సపోర్టింగ్ యాక్టర్ని. ఇతర పాత్రధారులు ఎంపిక, వారు పడిన కష్టం తెరమీద చూస్తే తెలుస్తుంది. ఇలాంటి కథను చేయడమే చాలా కష్టం. షూటింగ్‌లో పడిన కష్టం అంతా ఇంతా కాదు. అలాంటి కష్టాలను అధిగమించి ఒక్కడు మిగిలాడు చిత్రాన్ని తెరకెక్కించాం.

 ఎమోషనల్‌గా లీడర్ రోల్

ఎమోషనల్‌గా లీడర్ రోల్

ఓ వర్గానికి నాయకుడి పాత్ర ఎంట్రీ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. మరో హీరో పాత్ర చాలా సాదాసీదా సాగుతుంది. ఈ సినిమా తీయడమే కష్టం. చాలా భావోద్వేగాలను చూపించాం. వాస్తవ కథలో కొంత మాత్రమే చూశాం. లీడర్ పాత్రకు చాలా కష్టపడ్డాను. శారీరకంగానూ, మానసికంగానూ గాయపడ్డాను. అయితే నటుడిగా చాలా సంతృప్తిని ఇచ్చింది.

 సెన్సార్ ఇబ్బందులు

సెన్సార్ ఇబ్బందులు

తమిళంలో సెన్సార్ పూర్తి కాలేదు. త్వరలో సెన్సార్‌కు వెళ్తాం. ప్రస్తుతం తెలుగులో విడుదల చేయడానికి చాలా కష్టపడుతున్నాం. సెన్సార్ ఇబ్బందులను అధిగమించడం చాలా ఇబ్బందిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X