మోహన్ బాబు పొరుగింట్లో మనోజ్ నివాసం...
మంచు మనోజ్ హీరోగా 'ఝుమ్మంది నాదం' చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మోహన్ బాబు, మనోజ్ ఇరుగు పొరుగు వారిగా కనిపిస్తారు. తండ్రి మోహన్ బాబుతో కలిసి మనోజ్ పోటాపోటీగా నటించే సన్నివేశాలుంటాయి. అలాగే ఉన్నదున్నట్టు మొహం మీద చెప్పేసే పాత్రను మనోజ్ పోషించాడు. భద్రాచలం నుంచి వచ్చే కుర్రాడి పాత్ర అది. అతను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వీరాభిమాని. అతని పేరు కూడా అదే. బాలు స్థాయిలో గాయకుడు కావాలన్నది అతని ఆకాంక్ష. తన లక్ష్యం చేరుకొనే క్రమంలో భద్రాచలం బాలుకి ఎదురైన అనుభవాల సమాహారమే ఈ చిత్రం. 'ఝుమ్మంది నాదం' చిత్రంతో తాప్సీ నాయికగా పరిచయమవుతోంది. వేదం దర్శకుడు క్రిష్ కూడా చిత్రంలో ఓ కీలకపాత్రలో గెస్ట్ గా కనపడతాడు. ఇక ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది.
మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న రాఘవేంద్రరావు మంచు మనోజ్ ఝుమ్మంది నాదం manoj kumar vedam raghavendra rao jhummandi naadam


Click it and Unblock the Notifications