పోసాని చేసిన పాత్రలో మంచు మనోజ్ ...
ప్రస్తుతం శింబు 'వాలు', 'వేట్టె మన్నన్'లలో నటిస్తున్నాడు. వీటి తర్వాత 'పోటుగాడు' పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇందులో మనోజ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఏ పాత్ర అనేది ఇంకా అఫీషియల్ గా తెలియదు. అయితే తెలుగులో పోసాని పోషించిన పాత్ర అని చెప్తున్నారు. పోసాని పాత్రకు లవ్ స్టోరీ ఉంటుంది. అదే పాత్రను మనోజ్ పోషిస్తున్నాడని చెప్తున్నారు. మనోజ్, శింబు మధ్య వచ్చే సన్నివేసాలు అలరిస్తాయని తమిళ వర్గాలు చెప్తున్నాయి.
తెలుగులో ఓ సినిమా హిట్టైందంటే తమిళంలో హీరోలు ఎలర్టవుతారు. వాళ్లు ప్రతీ శుక్రవారం ఇక్కడేం సినిమాలు రిలీజ్ అవుతాయో ఓ కన్నేసి చూసుకుంటూంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల విషయంలో అయితే మరీను. షూటింగ్ లో ఉండగానే స్టోరీ లైన్ అదీ కనుక్కుని రీమేక్స్ రైట్స్ కోసం తమ నిర్మాతలను పంపుతూంటారు. ఈ సినిమాల రీమేక్ విషయంలో విజయ్, జయంరవి వరుసలో శింబు కూడా ఉన్నాడు. 'ఇడియట్', 'భద్ర', 'వేదం' వంటి పలు తమిళ రీమేక్‌లలో నటించిన శింబు తాజాగా ఈ రీమేక్ సినిమాకి సిద్ధమవుతున్నాడు.
ఈ చిత్రం కన్నడలో 'గోవిందాయనమః'కు రీమేక్‌గా రూపొందింది. మనోజ్ కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని త్వరలో స్వయంగా లగడపాటి శ్రీ్ధర్ తమిళంలో నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సాధారణంగా తమిళ సినిమాలే ఎక్కువగా తెలుగులోకి రీమేక్ కావడం లేదా డబ్బింగ్ రూపంలో మనముందుకు రావడం సహజంగా ఎక్కువ శాతం జరుగుతుంటుంది. ఎప్పుడోగానీ మన సినిమాలు తమిళంలోకి రీమేక్ కావడం అరుదు. అయితే తాజాగా తమిళంలో శింబు హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ-''ఈ చిత్రం తెలుగు వెర్షన్ చూసిన శింబు ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తిని కనబరిచారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు 'నా ఆటోగ్రాఫ్..స్వీట్ మెమొరీస్' ఫేమ్ చరన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నటుడు సంతానం కీలకపాత్రను పోషిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం''అని చెప్పారు.


Click it and Unblock the Notifications












