మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’ మార్చి 3న
మంచు మనోజ్ కథానాయుడుగా రూపొందుతున్న 'మిస్టర్ నూకయ్య" చిత్రం మార్చి 3న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అని కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని డిఎస్ రావు నిర్మిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...''మిస్టర్ నూకయ్య నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. మరో 4 రోజుల్లో తొలి కాపీ సిద్ధం అవుతోంది. ఆ వెంటనే సెన్సార్ కు వెళ్ల నుంది. ''నో క్యాప్షన్-ఓన్లీ యాక్షన్"" అన్న ఉప శీర్షికకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఆద్యంతం యాక్షన్, కామెడీతో నిండి ఉంటుంది. కథానుగుణంగా ఈ సినిమాకు ''మిస్టర్ నూకయ్య"" అనే టైటిల్ ను పెట్టడం జరిగింది. మనోజ్ ఇందులో 12 గెటప్స్ తో కనిపిస్తూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తాడు. రియల్ గా తను చేసిన రిస్కీ ఫైట్స్ ఈ సినిమాలో ఓ హైలెట్ గా నిలుస్తాయి. అన్న విభాగాల నుంచి ది బెస్ట్ ఔట్ పుట్ వచ్చింది. నిర్మాత డి.ఎస్.రావు మేకింగ్ పరంగా ఎక్కడా తగ్గింది లేదు. ఆడియో సూపర్ హిట్ అయింది. సినిమా సైతం 2012లో ఉత్తమ కమర్షియల్ చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది"" అన్నారు.
నిర్మాత డిఎస్.రావు మాట్లాడుతూ...కథ ప్రకారమై ఈ చిత్రానికి ''మిస్టర్ నూకయ్య"" టైటిల్ పెట్టడం జరిగింది. మాస్ ఆడియన్స్ కు ఈ టైటిల్ బాగా చేరువవుతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమాలో అన్ని హైలెట్సే. మనోజ్ కెరీర్ లో అన్ని విధాల చెప్పుకోదగ్గ చిత్రంగా నిలుస్తుంది. ఆడియో సక్సెస్ అయింది. సినిమా విజయంపై కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాము. మార్చి 3న నాలుగు వందల థియేటర్స్‌లో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
మొన్నటి వరకు చిత్రం పేరు మిస్టర్ నోకియాగా ప్రచారంలో ఉంది. అయితే నోనియా కంపెనీ వారు తమ పేరు వాడుకోవడంపై నోటీసులు ఇవ్వడంతో ఆ సినిమా పేరును మిస్టర్ నూకయ్యగా మార్చినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే దర్శక నిర్మాతలు మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదు.


Click it and Unblock the Notifications











