twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు మనోజ్ తాజా చిత్రం విశేషాలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : గత సంవత్సరం మిస్టర్ నూకయ్య, ఉకొడతారా ఉలిక్కి పడతారా? చిత్రాల్లో నటించిన మంచు మనోజ్ తాజాగా 2013 సంవత్సరంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు. సాయిరత్న క్రియేషన్స్ బేనర్ పై బొమ్మదేవర రామ చంద్రరావు రూపొందుతున్న ఈచిత్రం షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలు కానుంది.

    నాగార్జున పర్సనల్ మేకప్ మేన్‌గా పని చేసిన బొమ్మదేవర రామచంద్రరావు గతంలో సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై అనుష్క హీరోయిన్ గా 'పంచాక్షరి' చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రొడక్షన్ నెం.2గా తాజాగా తమ బేనర్ పై రెండో చిత్రంగా మనోజ్ తో సినిమాకు రెడీ అయ్యారు.

    ఈ చిత్రం గురించి నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు మాట్లాడుతూ...మనోజ్ హీరోగా భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ ఫిబ్రవరి మొదటి వారంలో సినిమా ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.

    గత సంవత్సరం మనోజ్ నటించిన రెండు సినిమాలు అనుకున్న ఫలితాలను సాధించ లేక బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. సాయిరత్న క్రియేషన్స్ సంస్థ రూపొందించిన 'పంచాక్షరి' సినిమా కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్లాపు కాంబినేషన్లు వెరసి ఈ సినిమాతోనైనా హిట్ బాట పడతారో లేదో చూడాలి.

    English summary
    Manchu Manoj’s new film Sai Ratna Creations. The movie all set to begin work on a new movie from February. The film will be produced by Akkineni Nagarjuna’s personal makeupmen Ramachandra Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X