twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిజాస్టర్స్ ఇచ్చిన దర్శకుడుతో మంచు మనోజ్ కొత్త చిత్రం

    By Srikanya
    |

    మనోజ్ హీరోగా మరో చిత్రం మొదలైంది. శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై అని దర్శకత్వంలో డి.ఎస్.రావు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.3 చిత్రం పూజా కార్యక్రమాలను హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో నిర్వహించారు.ఈ చిత్రాన్ని అని(అనీల్ కృష్ణ) డైరక్ట్ చేస్తున్నారు. అనీల్ కృష్ణ గతంలో అసాధ్యుడు, జంక్షన్ చిత్రాలుకు డైరక్షన్ చేసారు. ఆ రెండూ మెగా డిజాస్టర్స్ గా పేరు గాంచాయి.

    ఇక ఈ చిత్రం ప్రారంభం సందర్భంగా చిత్ర దర్శకుడు అని మాట్లాడుతూ...ఇప్పుడు ప్రేక్షకులు కొత్త లుక్ కావాలని కోరుకుంటున్నారు. అలా మా చిత్రం న్యూ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఫ్రెష్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతారు. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తిచేస్తామని తెలిపారు.

    మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో డాక్టర్ బ్రహ్మానందం, రఘుబాబు, డాక్టర్ శివప్రసాద్, వెన్నెల కిషోర్, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: రాజశేఖర్, కూర్పు: గౌతమ్ రాజు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, ఆర్ట్: మని, నిర్మాత: డి.ఎస్.రావు, రచన, దర్శకత్వం: అని.

    English summary
    Manchu Manoj new film under Ani (Anil Krishna) direction is Launched today in Hyderabad at production house office. After Pooja the bounded script was handed it to Director Ani by Manoj, paruchuri venkateswara rao and producer DS Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X