»   » తొలి సినిమా: భార్య ప్రణతితో కలిసి మనోజ్ (ఫోటోస్)

తొలి సినిమా: భార్య ప్రణతితో కలిసి మనోజ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాక్ స్టార్ మంచు మనోజ్ హీరోగా (సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం) ఫేం జి.ఈశ్వర్ దర్శకత్వంలో నూతన సంస్థ జ్యోత్న్స ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం (31.5.2015) ఉదయం ఫిలించాంబర్ దేవస్థానంలో జరిగాయి. హీరో మనోజ్ క్లాఫ్ ఇవ్వగా, గౌతమ్, మిసెస్ గౌతమ్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ఈశ్వర్ దర్శకత్వంలో రాజరాజేశ్వరీ అమ్మవారి విగ్రహంపై ముహూర్తం షాట్ ను తీసారు. తొలిసారిగా మంచు మనోజ్ తన భార్య ప్రణతితో కలిసి సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

అనంతరం హీరో మనోజ్ మాట్లాడుతూ - ''కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది'' అని తెలిపారు.

డైరెక్టర్ ఈశ్వర్ మాట్లాడుతూ - ''నాకీ అవకాశం ఇచ్చిన మంచు మనోజ్ గారికి, మంచు ఫ్యామిలీకి కృతజ్ఞతలు. ఈ చిత్రం నా కెరియర్ లో, మనోజ్ గారి కెరియర్ లో, జ్యోత్న్స ఫిలింస్ బ్యానర్ లో మైలురాయిగా నిలిచే చిత్రం అవుతుందని ప్రామిస్ గా చెప్పగలను. స్ర్కిఫ్ట్ పరంగా హీరో, ఇద్దరు హీరోయిన్స్, 15మంది ఇతర ఆర్టిస్ట్ లతో మేజర్ పార్ట్ ని దుబాయ్ లో షూట్ చేయాల్సి ఉంటుంది. నిర్మాత జస్వంత్ ఖర్చుకు వెనకాడకుండా వెంటనే ఒకే చెప్పారు. మంచి సినిమా నిర్మించాలనే తపన ఉన్న నిర్మాత జస్వంత్. ఇద్దరు హీరోయిన్స్ తో మనోజ్ చేసే లవబుల్ రొమాంటిక్ జర్నీతో పాటు ఎంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ బ్రహ్మానందంతో చేసే కామెడీ హైలెట్ గా నిలుస్తుంది. టోటల్ గా రెండు గంటలు కడుపుబ్బా నవ్వించగలిగే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుంది'' అని చెప్పారు.

నిర్మాత జస్వంత్ మాట్లాడుతూ - ''ముందుగా మనోజ్ గారికి కృతజ్ఞతలు. మా తొలి సినిమానే మా బ్యానర్ వ్యాల్యూ పెరిగేలా ఉంటుంది. ఈశ్వర్ చెప్పిన కథ నచ్చడంతో ఖర్చుకి వెనకాకుండా మంచి సాంకేతిక వర్గం, టాప్ ఆర్టిస్ట్ లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాం. జూలై సెకండ్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. త్వరలో టెక్నీషియన్స్ ని, ఆర్టిస్ట్ ల పేర్లును వెల్లడిస్తాం. మీ అందరి ఆశీస్సులతో మా ఈ మొదటి ప్రయత్నం సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం'' అని అన్నారు.

మనోజ్-ప్రణతి రెడ్డి

మనోజ్-ప్రణతి రెడ్డి

తన కొత్త సినిమా ప్రారంభోత్సవంలో భార్య ప్రణతి రెడ్డితో కలిసి మంచు మనోజ్

కెమెరా స్విచాన్

కెమెరా స్విచాన్

గౌతం సతీమణి కెమెరా స్విచాన్ చేస్తున్న దృశ్యం.

స్క్రిప్టు

స్క్రిప్టు

సినిమాకు సంబంధించిన స్క్రిప్టుకు పూజా కార్యక్రమాలు

మనోజ్

మనోజ్

మంచు మనోజ్ హీరోగా ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ లో జరిగింది.

English summary
Tollywood actor Manchu Manoj new movie details.
Please Wait while comments are loading...