twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనోజ్ ‘పోటుగాడు’ ఫస్ట్ లుక్ (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మంచు మనోజ్ త్వరలో 'పోటుగాడు' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రంలో మనోజ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకు రిలీజైంది. ఇందులో మనోజ్ టైటిల్ కు తగిన విధంగా డిఫరెంట్ లుక్ తో పోటుగాడిలా ఉండటం విశేషం.

    ప్రస్తుతం 'పోటుగాడు' షూటింగ్ కర్నాటకలోని బీజాపూర్లో జరుగుతోంది. రెండు నెలల పాటు ఇక్కడే షూటింగ్ జరుపనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. మార్చి 21న ఈచిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం జరుగగా ఏప్రిల్ 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు.

    సినిమా ప్రారంభం సందర్బంగా మనోజ్ తన ట్విట్టర్లో స్పందిస్తూ... 'బీజాపూర్ చేరుకున్నాం...ఎండలు మండిపోతున్నాయ్...నా కాస్టూమ్స్ షెర్వానీలాగా మందంగా ఉన్నాయి....40 డిగ్రీల ఎండలో ఇలాంటి దుస్తువులు వేసుకోవడం నరకమే...ఆ దేవుడే నన్ను కాపాడాలి' అంటూ ట్వీట్ చేసాడు.

    కన్నడ దర్శకుడు పవన్ వడెయార్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, లగడపాటి శ్రీధర్ ఈచిత్రాన్ని రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. పోటుగాడు చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పని చేస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈచిత్రంలో నలుగురు హీరోయిన్లు నటించబోతున్నారు. సాక్షి చౌదరి, సిమ్రాన్ ముండి, నథాలియా కౌర్ నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది. ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం తర్వాత మనోజ్ చేస్తున్న సినిమా ఇదే.

    English summary
    Manchu Manoj ‘Potugadu’ first look released. Pavan is the director of the film and it is being produced by Sirisha and Sridhar under Ramalakshmi Cine Creations banner. Four heroines are going to act in this film. Sakshi Chowdary, Simran Mundi and Nathalia Kaur are three of them and the fourth heroine is yet to be finalized.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X