మంచు మనోజ్ 'పోటుగాడు' విడుదల ఖరారు
హైదరాబాద్: రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'పోటుగాడు' . ఈ చిత్రాన్ని రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. పవన్ బడియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఇక ఈ చిత్రం ఓ కన్నడ రీమేక్ . కోమల్ హీరోగా వచ్చిన 'గోవిందాయ నమ:'.. చిత్రం తెలుగులో 'పోటుగాడు' గా తెరకెక్కుతోంది. కన్నడంలో దర్శకత్వం చేసిన పవన్ ఈ చిత్రానికి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే 'పోటుగాడు' చిత్రాన్ని తమిళంలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో నిర్మిస్తారు.
'పోటుగాడు' చిత్రంలో మంచు మనోజ్‌తో కలిసి ఓ పాటను పాడారు శింబు. ఇప్పటికే ఈ సాంగు రికార్డింగ్ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
మంచు మనోజ్ చిత్రం గురించి చెప్తూ.. అటు పొగడ్తకి, ఇటు తెగడ్తకి రెండింటికీ సరిపోయే పదం 'పోటుగాడు'. నా శారీరకభాషకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. టైటిల్‌కి తగ్గట్టే ఇందులో తన పాత్ర కూడా ఉంటుందని మనోజ్ అంటున్నారు. చక్రి, అచ్చు ద్వయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి లగడపాటి శ్రీధర్ నిర్మాత.


Click it and Unblock the Notifications












