మంచు మనోజ్-ప్రణతి రెడ్డి ఎంగేజ్మెంట్ హైలెట్స్
హైదరాబాద్: మంచు ఫ్యామిలీలో ఈ రోజు ఉదయం నుండి సందడి వాతావరణం నెలకొంది. అందు కారణం ఏమిటో కొత్తగా చెప్పక్కర్లేదు. మీరు ఊహించింది నిజమే...ఈ రోజు మంచు మనోజ్ నిశ్చితార్థం. గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న గర్ల్ ఫ్రెండు ప్రణతి రెడ్డితో అతని నిశ్చితార్థం ఈ రోజు జరిగింది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ ఇందుకు వేదికైంది.

డిజైనర్ బ్రైడల్ వేర్ ధరించి మంచు మనోజ్-ప్రణతి రెడ్డి అందంగా మెరిసి పోయారు. ప్రణతి రెడ్డి తన ఫస్ట్ అప్పియరెన్స్ పసుపురంగు పట్టుచీరలో దర్శనమిచ్చింది. కుదనపు బొమ్మలా మెరిసి పోయింది. పలువురు టాప్ ఫిల్మ్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు.

మంచు లక్ష్మి, వెరోనికా, విష్ణు మంచు ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆ మధ్య ఓ ఇంట్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ ఆమెను ఫస్ట్ టైం చూసినపుడే నా భార్యగా ఫిక్సయ్యానని చెప్పుకొచ్చాడు. చార్టెడ్ అకౌంటెంట్ అయిన ప్రణతి రెడ్డి మనోజ్ వదిని వెరోనికా రెడ్డి క్లాస్‌మేట్ అనే సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











